చాక్లెట్లంటే చిన్న పిల్లలకు ఎంతో ఇష్టమో మనందరికి తెలిసిందే. అలాంటి చాక్లెట్ల టేస్ట్‌కి బ్రిటన్ రాణి క్వీన్‌ఎలిజబెత్ కూడా ఫిదా అయ్యిపోయేవారట. ఆమె తన స్నాక్స్ టైంలో చాక్లెట్లు తప్పనిసరిగా ఉండాల్సిందేనట. రాజదర్పానికి తగ్గట్టుగా ఆమె అత్యంత ఖరీదైన చాక్లెట్లనే ఇష్టపడేవారట. అవి అంటే ఆమెకు మహాప్రీతి అని బకింగ్‌హామ్ ప్యాలెస్ చెఫ్ చెబుతున్నారు. అంతేగాదు ఆయన క్వీన్ ఇష్టపడే చాక్లెట్లకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను కూడా వెల్లడించారు. అవేంటో చూద్దామా..!.
దివంగత క్వీన్ ఎలిజబెత్ II చాలా క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అవలంభించేవారు. ఆమె మంచి ఆహారపు అలవాట్లకు ప్రసిద్ధిగాంచిన రాణి కూడా. అయితే క్వీన్ ఎలిజబెత్‌కి సైతం చాక్లెట్‌లంటే ఇష్టమని ఆ రాజకుటుంబానికి సేవలందించిన చెఫ్ డారెన్ మెక్‌గ్రాడీ చెబుతున్నారు. ఆమె డార్క్ చాక్లెట్‌లు మాత్రమే ఇష్టంగా తినేవారని అన్నారు.
పాలతో తయారు చేసిన చాక్లెట్‌లను ఇష్టపడేవారు కారట. డార్క్ చాక్లెట్‌తో మిక్స్ చేసి ఉండే పుదీనా బెండిక్స్ ఫాండెట్‌లను ఇష్టంగా తినేవారట. ఈ చాక్లెట్ బాక్స్ ఒక్కోటినే రూ. 544లు పలుకుతుందట. ఆమె రోజులో ఉదయం అల్పాహరం, మధ్యాహ్నం భోజనం, సాయం సమయంలో టీ.. ఆపై రాత్రి భోజనంగా జీవనశైలి ఉంటుందట.
ఆమె గనుక రోజుని ఎర్ల్ గ్రే టీ విత్ బిస్కెట్స్‌తో ప్రారంభిస్తే..కచ్చితంగా రోజంతా డిఫరెంట్ చాక్లెట్‌లను ఆస్వాదించేవారని చెప్పుకొచ్చారు మెక్‌గ్రాడీ. అలాగే అత్యంత లగ్జరియస్ చాక్లేటియర్ చార్‌బొన్నెల్ చాక్లెట్‌ని అమితంగా ఇష్టపడేవారని అన్నారు. దీని ఖరీదు ఏకంగా రూ. 30 వేలు పైనే ఉంటుందట. ఇక్కడ రాణి గారు ఇష్టపడే బెండిక్స్, చార్‌బొన్నెల్ బ్రాండ్‌లు రెండు బ్రిటన్‌కి చెందిన ఫేమస్ బ్రాండ్‌లే కావడం విశేషం.
ఇక డైట్ పరంగా క్వీన్ ఎలిజబెత్ సమతుల్య ఆహారాన్నే తీసుకునేవారని చెఫ్ మెక్‌గ్రాడి చెబుతున్నారు. ఆమె చాక్లెట్ పరిమాణం కంటే నాణ్యతపైనే దృష్టి పెట్టి తీసుకునేవారని అన్నారు. ఆరోగ్యం పట్ల ఉన్న ఈ నిబద్ధతే క్వీన్ ఎలిజబెత్ సుదీర్ఘకాల జీవన రహస్యం కాబోలు..!.
(చదవండి: వెదురు బ్రష్‌లు ఎప్పుడైనా చూశారా..?)
Comments
Please login to add a commentAdd a comment