chocolate boxes
-
బ్రిటన్ రాణి సైతం చాక్లెట్ టేస్ట్‌కీ ఫిదా..!
చాక్లెట్లంటే చిన్న పిల్లలకు ఎంతో ఇష్టమో మనందరికి తెలిసిందే. అలాంటి చాక్లెట్ల టేస్ట్‌కి బ్రిటన్ రాణి క్వీన్ఎలిజబెత్ కూడా ఫిదా అయ్యిపోయేవారట. ఆమె తన స్నాక్స్ టైంలో చాక్లెట్లు తప్పనిసరిగా ఉండాల్సిందేనట. రాజదర్పానికి తగ్గట్టుగా ఆమె అత్యంత ఖరీదైన చాక్లెట్లనే ఇష్టపడేవారట. అవి అంటే ఆమెకు మహాప్రీతి అని బకింగ్‌హామ్ ప్యాలెస్ చెఫ్ చెబుతున్నారు. అంతేగాదు ఆయన క్వీన్ ఇష్టపడే చాక్లెట్లకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను కూడా వెల్లడించారు. అవేంటో చూద్దామా..!.దివంగత క్వీన్ ఎలిజబెత్ II చాలా క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అవలంభించేవారు. ఆమె మంచి ఆహారపు అలవాట్లకు ప్రసిద్ధిగాంచిన రాణి కూడా. అయితే క్వీన్ ఎలిజబెత్‌కి సైతం చాక్లెట్లంటే ఇష్టమని ఆ రాజకుటుంబానికి సేవలందించిన చెఫ్ డారెన్ మెక్‌గ్రాడీ చెబుతున్నారు. ఆమె డార్క్ చాక్లెట్లు మాత్రమే ఇష్టంగా తినేవారని అన్నారు. పాలతో తయారు చేసిన చాక్లెట్లను ఇష్టపడేవారు కారట. డార్క్ చాక్లెట్‌తో మిక్స్ చేసి ఉండే పుదీనా బెండిక్స్ ఫాండెట్లను ఇష్టంగా తినేవారట. ఈ చాక్లెట్ బాక్స్ ఒక్కోటినే రూ. 544లు పలుకుతుందట. ఆమె రోజులో ఉదయం అల్పాహరం, మధ్యాహ్నం భోజనం, సాయం సమయంలో టీ.. ఆపై రాత్రి భోజనంగా జీవనశైలి ఉంటుందట. ఆమె గనుక రోజుని ఎర్ల్ గ్రే టీ విత్ బిస్కెట్స్‌తో ప్రారంభిస్తే..కచ్చితంగా రోజంతా డిఫరెంట్ చాక్లెట్లను ఆస్వాదించేవారని చెప్పుకొచ్చారు మెక్‌గ్రాడీ. అలాగే అత్యంత లగ్జరియస్ చాక్లేటియర్ చార్బొన్నెల్ చాక్లెట్‌ని అమితంగా ఇష్టపడేవారని అన్నారు. దీని ఖరీదు ఏకంగా రూ. 30 వేలు పైనే ఉంటుందట. ఇక్కడ రాణి గారు ఇష్టపడే బెండిక్స్, చార్బొన్నెల్ బ్రాండ్లు రెండు బ్రిటన్‌కి చెందిన ఫేమస్ బ్రాండ్లే కావడం విశేషం. ఇక డైట్ పరంగా క్వీన్ ఎలిజబెత్ సమతుల్య ఆహారాన్నే తీసుకునేవారని చెఫ్ మెక్‌గ్రాడి చెబుతున్నారు. ఆమె చాక్లెట్ పరిమాణం కంటే నాణ్యతపైనే దృష్టి పెట్టి తీసుకునేవారని అన్నారు. ఆరోగ్యం పట్ల ఉన్న ఈ నిబద్ధతే క్వీన్ ఎలిజబెత్ సుదీర్ఘకాల జీవన రహస్యం కాబోలు..!.(చదవండి: వెదురు బ్రష్‌లు ఎప్పుడైనా చూశారా..?) -
చాక్లెట్ బాక్సుల్లో గోల్డ్ స్మగ్లింగ్
ఫాయిల్స్ రూపంలోకి మార్చి తెచ్చిన స్మగ్లర్ సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం కస్టమ్స్ ఆధీనంలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు చాక్లెట్ బాక్సుల్లో ఫాయిల్స్ రూపంలో తెచ్చిన బంగారా న్ని గురువారం స్వాధీనం చేసు కున్నారు. అబుదాబి నుంచి వస్తున్న ఓ స్మగ్లర్ దాదాపు అర కేజీ బంగారాన్ని ఫాయిల్స్ రూపంలోకి మార్చి మూడు బాక్సుల్లో అమర్చి తీసుకువచ్చాడు. అతడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. ఈ తరహాలో స్మగ్లింగ్ ముంబై, ఢిల్లీ విమానాశ్రయాలు కేంద్రంగా ఎక్కువగా జరుగుతుందని, శంషాబాద్‌లో చిక్కడం అరుదని అధికారులు చెప్తున్నారు. ఓ వ్యక్తి గురువారం ఉదయం జెట్ ఎయిర్వేస్ ఫ్లైట్‌లో (నం.9డబ్ల్యూ549) శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నాడనే అనుమానంతో ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఏమీ లభిం చకపోవడంతో లగేజ్‌ను తనిఖీ చేయగా.. రెండు చాక్లెట్ బాక్సులు, మరో ఫేస్‌క్రీమ్ బాక్సు లభించాయి. వాటిని తెరిచి చూడగా సాధారణ వస్తువులే కనిపించాయి. అయితే ఈ బాక్సుల అడుగు, గోడలు కాస్త మందంగా ఉండటంతో వాటిని పూర్తిగా ఖాళీ చేసి పరిశీలించారు. ఈ నేపథ్యంలో బంగారాన్ని ఫాయిల్స్ రూపంలోకి మార్చి, ఆ గోడలకు అమర్చడంతో పాటు దానిపై గమ్ పేపర్‌తో మరో పొర ఏర్పాటు చేశారని గుర్తించారు. మూడు బాక్సుల్లో ఉన్న ఫాయిల్స్ 423 గ్రాముల బరువు ఉన్నాయని, వీటి ధర రూ.12.09 లక్షలుగా అధికారులు నిర్థారించారు. స్మగ్లర్‌ను అరెస్టు చేసిన కస్టమ్స్ అధికారులు దీని వెనుక ఏదైనా ముఠా ఉందా? సూత్రధారులు ఎవరు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.