ఇంకా ఆస్పత్రిలోనే దాసరి | Dasari Narayanarao still in hospital | Sakshi
Sakshi News home page

ఇంకా ఆస్పత్రిలోనే దాసరి

Published Sat, Mar 4 2017 7:03 PM | Last Updated on Tue, Sep 5 2017 5:12 AM

ఇంకా ఆస్పత్రిలోనే దాసరి

ఇంకా ఆస్పత్రిలోనే దాసరి

హైదరాబాద్ :
సినీ దర్శకుడు దాసరి నారాయణరావు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ కావడానికి మరో రెండు వారాలు పట్టే అవకాశం ఉందని కిమ్స్ ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ బి.భాస్కర్‌రావు తెలిపారు. శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతూ గత 35 రోజుల క్రితం దాసరి ఆసుపత్రిలో చేర్పించారు. ఊపిరితిత్తుల్లోని ఇన్‌ఫెక్షన్‌ క్లీన్‌ చేస్తున్న సమయంలో ఆయనకు గుండెపోటు రావడం, కిడ్నీల పనితీరు మందగించడంతో ఆయన్ను నాలుగు రోజుల పాటు వెంటిలేటర్‌పై ఉంచి డయాలసిస్‌ నిర్వహించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఊపిరితిత్తుల్లోని ఇన్‌ఫెక్షన్‌ తగ్గుముఖం పట్టిందని, మూత్ర పిండాల పని తీరు కూడా మెరుగుపడిందని వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement