ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక కుంభకోణం | Opposition leader c. Ramachandraiah comments on Chandrababu | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక కుంభకోణం

Published Sun, Jun 26 2016 12:47 AM | Last Updated on Sat, Jul 28 2018 3:33 PM

ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక కుంభకోణం - Sakshi

ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక కుంభకోణం

రాజధాని సెంటిమెంట్‌ను దోపిడీగా మార్చుకున్న చంద్రబాబు: సీఆర్
సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణం ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక కుంభకోణంగా మారి చరిత్రకెక్కనుందని శాసన మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య ఆరోపించారు. శనివారం ఇందిర భవన్‌లో కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా గౌతం, ఉపాధ్యక్షుడు సూర్యానాయక్‌లతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు.

రాజధాని సెంటిమెంట్ వెనుక లక్షల కోట్ల దోపిడీ దాగి ఉందని, అందులో భాగంగానే సింగపూర్ కంపెనీలతో ఒప్పందాలను చేసుకున్నారన్నారు. సింగపూర్ కంపెనీలతో ప్రభుత్వం చేసుకున్న స్విస్ చాలెంజ్ ఒప్పందాలను తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. రాజధాని నిర్మాణంలో చంద్రబాబుకు రహస్య ఎజెండా లేకపోతే గ్లోబల్ టెండర్లను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. ఎంపిక చేసుకున్న కంపెనీలకు మాత్రమే అవకాశం వచ్చే విధంగా క్విడ్‌ప్రోకో  అనుసరిస్తూ చంద్రబాబు చారిత్రక తప్పిదం చేస్తున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement