సతీష్‌చంద్రకు ‘ముఖ్య’ బాధ్యతలు | Satiscandra to the 'core' responsibilities | Sakshi
Sakshi News home page

సతీష్‌చంద్రకు ‘ముఖ్య’ బాధ్యతలు

Published Fri, Jan 23 2015 3:09 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

సతీష్‌చంద్రకు ‘ముఖ్య’ బాధ్యతలు - Sakshi

సతీష్‌చంద్రకు ‘ముఖ్య’ బాధ్యతలు

హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్ర ఇప్పుడు నంబర్‌వన్‌గా వ్యవహరిస్తున్నారు. కీలకమైన సాధారణ పరిపాలన, హోం, ఆర్థిక, రాజధాని నిర్మాణం తదితర శాఖలను సీఎం ఆయనకే అప్పగించారు. ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయం సంయుక్త కార్యదర్శిగా నియమితులైన ఎస్.ప్రద్యుమ్నకు రెవెన్యూ (సహాయ-పునరావాసం), మానవ వనరులు, గృహ నిర్మాణం, పంచాయతీరాజ్ వంటి శాఖలను అప్పగించారు. ముఖ్యమంత్రి తన పేషీలోని అధికారులకు తాజాగా కేటాయించిన శాఖల వివరాలు ఇవీ..

సతీష్ చంద్ర: సాధారణ పరిపాలన, హోంశాఖ, మున్సిపల్-పట్టణాభివృద్ధి, రవాణా-రహదారులు-భవనాలు, ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు,  స్టాంప్స్ అండ్ రిజస్ట్రేషన్స్, ఎక్సైజ్, పర్యావరణం-అటవీ, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, నైపుణ్య అభివృద్ధి, గనులు, పరిశ్రమలు, మౌలిక వసతులు పెట్టుబలు, నూతన రాజధాని, పర్యాటకం, న్యాయ శాఖ, శాసనసభా వ్యవహారాలు, ముఖ్యమంత్రి కార్యాలయ నిర్వహణ, ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలు, ఎవరికీ కేటాయించని అంశాలు.

 జి.సాయిప్రపాద్: రెవెన్యూ (ల్యాండ్), వ్యవసాయం, సహకారం, ఉద్యానవన, పశుసంవర్థక, సాగునీటి, విద్యుత్, పౌరసరఫరాలు-ధరల పర్యవేక్షణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ (దేవాదాయం).

 పి.ఎస్. ప్రద్యుమ్న: రెవెన్యూ (పునరావాసం-విపత్తుల నిర్వహణ), మానవ వనరులు (ప్రాధమిక, సెంకడరీ విద్య), గృహ నిర్మాణం, కార్మిక-ఉపాధి-శిక్షణ, యువజన సర్వీసులు-క్రీడా-సాంస్కృతిక, పంచాయతీరాజ్-గ్రామీణ మంచినీటి సరఫరా-పారిశుద్ధ్యం, ఆర్‌ఐఎడి, ప్రభుత్వ రంగ సంస్థలు.

 అజయ్ సహాని: వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమం.  సీహెచ్. వెంకయ్య చౌదరి: సీఎంఆర్‌ఎఫ్, సీఎం గ్రీవియన్స్ పర్యవేక్షణ, కేంద్ర నిధుల సమీకరణ-వ్యయం, ఆదాయ వనరుల సమీకరణ, కేంద్ర ప్రాజెక్టుల పర్యవేక్షణ.
 అభీష్ట: ఐటీ, ఐటీ మౌలిక వసతులు, ఇ-గవర్నెన్స్, ఏపీఎస్‌ఏ.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement