
మంత్రి వస్తున్నారంటూ నీరు వృధా
ప్రజలు తాగు నీరు లేక అల్లాడుతుంటే.. మంత్రి పర్యటన పేరిట అధికారులు ఐదు ట్యాంకర్ల నీరు నేలపాలు చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మునిసిపాలిటీలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పురపాలక మంత్రి నారాయణ శుక్రవారం గిద్దలూరులో పర్యటించనున్నారు.
ఈ క్రమంలో మంత్రి పర్యటించే సమయంలో రోడ్డు పై దుమ్ము పైకి లేవకుండా ఉండాలని అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మునిసిపల్ సిబ్బంది ఏకంగా ఐదు ట్యాంకర్ల నీరు రోడ్డు మీద పోశారు. సిబ్బంది చర్యల పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్త చేశారు. ప్రజలకు తాగు నీరు లేక ఇబ్బంది పడుతుంటే ఇదేం పని అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.