మంత్రి కళాశాలపై సమాచారం ఇవ్వడం లేదు..
ఆర్‌టీఐ సమావేశాలు నిర్వహించడం లేదు
సమాచారం అడిగినందుకు కుల సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు
అడిగితే ముఖ్యమంత్రికి చెప్పుకోమంటున్నారు
ఆర్‌టీఐ కమిషనర్‌కు ఫిర్యాదుల వెల్లువ
తిరుపతి కార్పొరేషన్ రాష్ట్ర మంత్రి నారాయణకు సం బంధించిన కళాశాలల గురించి సమాచా రం అడిగితే ఇవ్వడం లేదని సీపీఎం జయచంద్ర రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ పి.విజయబాబుకు ఫిర్యాదు చేశా రు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, వైఎస్‌ఆర్ సమావేశ మం దిరంలో రాయలసీమ పరిధిలోని సమాచార హక్కు చట్టం కింద కేసులను విచారించారు. పలువురు నేరుగా కమిషనర్ వద్దకు చేరుకుని ఆర్‌టీఐ ద్వారా తమకు సమాచారం అందడం లేదంటూ ఫిర్యా దు చేశారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్.జయచంద్ర మాట్లాడుతూ గిరిజన, వెనుకబడిన తరగతుల స్కాలర్‌షిప్స్, ఫీజు రీయంబర్స్‌మెంట్ వివరాలు ఇవ్వాలని నవంబర్‌లో కలెక్టరేట్ కార్యాల యంలో దరఖాస్తు చేసానన్నారు. రెండు నెలలు అవుతున్నా ఇంతవరకు సమాచారం ఇవ్వకపోగా ఉపయోగం లేని సమాచారం ఇస్తూ అవినీతి ని ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదు చేశారు. శ్రీకాళహస్తి ప్రభుత్వ బాలుర, బాలికల డిగ్రీ కళాశాలలో సమాచారం కోరితే 46 రోజులు గడుస్తున్నా ఇవ్వడం లేదన్నా రు. రెవెన్యూ పరమైన సమాచారం ఇవ్వ డం లేదని, దీనికి భాద్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కమిషనర్ స్పందిస్తూ మీకు సమాచారం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కుల సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు..
తిరుపతిలో తనకు బట్రాజు (బిసి-డి) కుల సర్టిఫికెట్ ఇవ్వకుండా అవమాని స్తున్నారంటూ లేపాక్షి ఈశ్వర్‌రాజు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. గతం లో పీలేరులో రెవెన్యూ పరమైన సమాచారం అడిగితే ఇవ్వనందుకు ఆర్‌టీఐ కమిషన్‌కు ఫిర్యాదు చేశానని, దాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుపతి రూరల్ తహవీల్దార్ యుగంధర్ సర్టిఫికెట్ ఇవ్వ డం లేదని ఆరోపించారు. పైగా సిఎంకు చెప్పుకో, జేడీ లక్ష్మీనారాయణకు చెప్పు కో అంటూ వెటకారంగా మాట్లాడుతున్నారని తెలిపారు. ఫలితంగా తన పిల్ల లు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆటంకం కలిగిస్తున్నారని ఫిర్యాదు చేశారు.
సంబంధం లేని సమాచారం ఇస్తున్నారు
గతంలో ఆర్‌టిఐ కమిషనర్ తాంతియాకుమారి నిర్వహించిన విచారణ, జరిమా నా విధింపు, జారీ చేసిన నోటీసుల వివరాలను ఆర్‌టిఐ సెక్షన్ 4(1)బి కింద సమాచారం అడిగితే సంబంధం లేని సమాచారం ఇచ్చారంటూ సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడు భాస్కర్ ఫిర్యాదు చేశారు. కమిషనరే స్వయంగా సమాచారం ఇవ్వాలని ఆదేశించినా జిల్లాలో ఆదేశాలు అమలు చేయడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.