సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మండి పడ్డారు. గతంలో వైఎస్సార్‌సీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను పార్టీలో చేర్చుకొని, వారిలో నలుగురిని మంత్రులను చేసి.. ఇప్పుడు ఫిరా యింపులపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంద న్నారు. ఆయన ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బీజేపీలో టీడీపీ రాజ్యసభాపక్షం విలీనంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు కళా వెంకట్రావు తదితరులు అవగా హనారాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శిం చారు.
షెడ్యూల్ 10లోని పేరా 4 ప్రకారం మెజారి టీ సభ్యుల తీర్మానం ప్రకారమే టీడీపీ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనమైందన్నారు. గతంలో ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చంద్ర బాబు ఏ ప్రాతిపదికన సీఎంఅయ్యారో మర్చిపో యారా.. అని ప్రశ్నించారు. తెలంగాణలోని 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 12 మంది తమదే ప్రధాన గ్రూప్ అంటూ టీఆర్‌ఎస్‌లో విలీనమ య్యారని చెప్పారు. సుజనాచౌదరి, సీఎం రమేష్ లు బీజేపీలో చేరాక.. నీరవ్ మోదీ, విజయ్ మాల్యాలను చేర్చుకున్నారంటూ ఎద్దేవా చేస్తున్న టీడీపీకి.. గతంలో వారు టీడీపీ ఎంపీలేనన్న విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment