విధులకు సక్రమంగా హాజరు కాని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుని డీఈఓ సస్పెండ్ చేసిన ఘటన బుధవారం మండలంలోని చందనాడ గ్రామంలో చోటుచేసుకుంది. చందనాడ ప్రాథమిక పాఠశాలలో శ్రీనివాస్ ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే.. కొంత కాలంగా.. విధులకు సక్రమంగా హాజరు కావడం లేదు.
దీంతో పాటు.. ఇష్టానుసారం.. స్కూలుకు సెలవులు ప్రకటిస్తున్నారు. దీంతో విద్యార్థుల భవిష్యత్ పై ఆందోళనగా ఉందంటూ.. గ్రామస్తులు డీఈఓ కృష్ణా రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పాఠశాలను తనిఖీ చేసిన డీఈఓ హెచ్‌ఎం శ్రీనివాస్‌ని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.