![TANTEX Conducted 153rd Telugu Sahityam Sadassu Through Online From Dallas - Sakshi](/styles/webp/s3/article_images/2020/04/21/Nri.jpg.webp?itok=2ZSTerkS)
డాలస్ : ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం(టాంటెక్స్) ఆధ్వర్యంలో నెల నెలా తెలుగు వెన్నెల153 వ సాహిత్య సదస్సు ఏప్రిల్ మూడవ ఆదివారం ఆన్ లైన్‌లో డాలస్‌లో ఘనంగా నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 153 నెలల పాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించడం ఈ సంస్థ యొక్క విశేషం. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో 153వ సాహిత్య సదస్సుని ఆన్‌లైన్‌లో ఘనంగా నిర్వహించిన ఘనత ఉత్తర టెక్సస్ తెలుగు సంఘానికే దక్కుతుంది.
ముందుగా సాహిత్య సమన్వయకర్త మల్లిక్ కొండా ఆధ్వర్యంలో చిన్నారుల ప్రార్థనా గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సత్యం, డాక్టర్ ఉర్మిండి నర్సింహారెడ్డి, భాషా శాస్త్రవేత్త భద్రిరాజు కృష్ణమూర్తి, డాక్టర్ బల్లూరి ఉమాదేవి, అయినంపూడి శ్రీలక్ష్మి, అనంత్ మల్లవరపు తదితరులు పాల్గొని తమ కార్యక్రమాలతో వీక్షకులను ఆనందింపజేశారు. కార్యక్రమం చివర్లో ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షుడు కృష్ణారెడ్డి కోడూరు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన పాలగుమ్మి రాజగోపాల్‌కు, ఆన్‌లైన్ కార్యక్రమంలో పాల్గొన్న సాహితీ ప్రియులందరికి కృతజ్ఞతలు తెలిపి ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment