అడ్డంగా నరుకుతా.. రెచ్చిపోయిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి | TDP MLA Kavya Krishna Reddy Warning To Own Party Leaders | Sakshi
Sakshi News home page

అడ్డంగా నరుకుతా.. రెచ్చిపోయిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

Published Sun, Sep 22 2024 10:15 AM | Last Updated on Sun, Sep 22 2024 11:24 AM

TDP MLA Kavya Krishna Reddy Warning To Own Party Leaders

సాక్షి, నెల్లూరు జిల్లా: అడ్డంగా నరుకుతా అంటూ సొంత పార్టీ నేతలపైనే కావలి టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి రెచ్చిపోయారు. వార్డు ఇంఛార్జ్‌ స్థాయికి కూడా పనికిరాని కొందరు తనపై లోకేష్‌కి ఫిర్యాదు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కావలి అడ్డాలో ఎక్కసెక్కాలు ఆడితే.. అడ్డంగా నరుకుతా అంటూ టీడీపీలోనే ప్రత్యర్థి వర్గానికి కావ్య వార్నింగ్ ఇచ్చేశారు. ఇటీవలే కావ్య కృష్ణారెడ్డిపై చంద్రబాబు, లోకేష్‌కు మాజీ ఇంచార్జ్  మాలేపాటి సుబ్బానాయడు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: దురుద్దేశంతో మహాపచారం

కాగా, ఇటీవల కావలి తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై మాజీ ఇన్‌ఛార్జ్‌ మాలేపాటి సుబ్బానాయుడు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జైల్లో ఉంటే  టపాసులు కాల్చిన నేతలకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు.

దగదర్తి మండలంలో తన వర్గాన్ని కొందరు ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని చంద్రబాబు,లోకేష్ వద్దే తేల్చుకుంటానని కార్యకర్తల సమావేశంలో మాలేపాటి వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం రూ.17 కోట్లు ఖర్చు పెట్టానంటూ మాలేపాటి వ్యాఖ్యానించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement