kaavali
-
అడ్డంగా నరుకుతా.. రెచ్చిపోయిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
సాక్షి, నెల్లూరు జిల్లా: అడ్డంగా నరుకుతా అంటూ సొంత పార్టీ నేతలపైనే కావలి టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి రెచ్చిపోయారు. వార్డు ఇంఛార్జ్ స్థాయికి కూడా పనికిరాని కొందరు తనపై లోకేష్‌కి ఫిర్యాదు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.కావలి అడ్డాలో ఎక్కసెక్కాలు ఆడితే.. అడ్డంగా నరుకుతా అంటూ టీడీపీలోనే ప్రత్యర్థి వర్గానికి కావ్య వార్నింగ్ ఇచ్చేశారు. ఇటీవలే కావ్య కృష్ణారెడ్డిపై చంద్రబాబు, లోకేష్‌కు మాజీ ఇంచార్జ్ మాలేపాటి సుబ్బానాయడు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: దురుద్దేశంతో మహాపచారంకాగా, ఇటీవల కావలి తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై మాజీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జైల్లో ఉంటే టపాసులు కాల్చిన నేతలకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.దగదర్తి మండలంలో తన వర్గాన్ని కొందరు ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని చంద్రబాబు,లోకేష్ వద్దే తేల్చుకుంటానని కార్యకర్తల సమావేశంలో మాలేపాటి వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం రూ.17 కోట్లు ఖర్చు పెట్టానంటూ మాలేపాటి వ్యాఖ్యానించారు. -
దత్తపుత్రుడు ఆరాట పడుతున్నాడు: బాలినేని
సాక్షి, కావలి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో సంపూర్ణ విజయాన్ని సాధిస్తామని జిల్లా ఇన్చార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి చెప్పారు. రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితులైన తర్వాత మొట్ట మొదటిసారిగా జిల్లాకు వస్తూ కావలిలోని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనను జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా నియమించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. జిల్లాలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలన్నింటిని కూడా కచ్చితంగా అమలు చేసే తీరుతామని చెప్పారు. జిల్లా ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన అభివృద్ధి పనులన్నీ కూడా అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీకి కంచుకోటగా ఉందని, జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు పది స్థానాల్లో వైఎస్సార్సీపీనే ప్రజలు గెలిపించారని మంత్రి గుర్తు చేశారు. దానికి ప్రతిఫలంగా తమ వంతుగా జిల్లాను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అటవీశాఖ అభ్యంతరాలు వల్ల దశాబ్దాలుగా నిలిచి పోయిన సాగునీటి కాలువలు నిర్మాణాలపై దృష్టి పెడతామన్నారు. రైతులకు సాగునీరు అందించే విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉందని, అటవీ శాఖ అధికారులను అమరావతికి పిలిపించి సాగునీటి కాలువలు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తామని చెప్పారు. రామాయపట్నంలో పోర్టు నిర్మాణం కోసం సీఎం అన్ని చర్యలు తీసుకొంటున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో వర్షాలు రావడంతో వరదలు వచ్చి అన్ని చోట్ల నీరు ప్రవహిస్తుంటే చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఇసుక కొరత అంటూ రాజకీయాల కోసం రాద్ధాతం చేస్తున్నారని మంత్రి మండి పడ్డారు. పవన్‌కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని అని, చంద్రబాబు కోసం ఏదేదో మాట్లాడుతున్నాడన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జనరంజక పాలన చేస్తే, తాను వెళ్లి సినిమాలు చేసుకొంటానని పవన్ కళ్యాణ్ చెప్పారన్నారు. మరీ పవన్‌కళ్యాణ్ సినిమాలు చేస్తున్నారంటే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి జనరంజక పాలన చేస్తున్నట్లే కదా అని మంత్రి అన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనపై సర్వే చేస్తే, సంక్షేమ పథకాల్లో 80 శాతం రాష్ట్రంలోని ప్రజలు ఆమోదం తెలిపారని మంత్రి వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు మన్నెమాల సుకుమార్‌రెడ్డి, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, కొండూరు అనీల్ బాబు, కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి పాల్గొన్నారు. -
కన్న కూతురిపై లైంగిక దాడి
సాక్షి, కావలి: కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేశాడు ఓ కామాంధ తండ్రి. పోలీసుల కథనం మేరకు జలదంకి మండలం బ్రాహ్మణక్రాక పంచాయతీలోని హనుమకొండపాళెం గ్రామానికి చెందిన కర్ర బాలరాజు బేల్దారి పనులు చేస్తుంటాడు. అతడికి భార్య, కుమారుడు ఉన్నారు. భార్య అనారోగ్యానికి గురి కావడంతో మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఒక అబ్బాయి, అమ్మాయి సంతానం కలిగారు. రెండో భార్య సంతానంలోని ఓ బాలిక పదో తరగతి చదువుతోంది. ఆ బాలికపై గత మే నెల నుంచి బలవంతంగా కామవాంఛను తీర్చుకుంటున్నాడు. ఈ విషయాన్ని బాలిక కుటుంబ సభ్యులు దాచిపెట్టారు. బాలిక అస్వస్థతకు గురికావడంతో సోమవారం కావలిలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి ఆరు వారాలు గర్భిణి అని నిర్ధారించారు. విషయం పోలీసులకు తెలియడంతో కావలి డీఎస్పీ డి.ప్రసాద్ నేతృత్వంలోని పోలీసుల బృందం ఆస్పత్రికి చేరుకొంది. అప్పటి వరకు ఆస్పత్రిలోనే ఉన్న బాలిక తండ్రి బాలరాజు అక్కడ నుంచి పారిపోయాడు. బాలిక కుటుంబ సభ్యులను విచారించగా, బహిర్భూమికి వెళ్లినప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని పొంతన లేని సమాధానాలు చెప్పసాగారు. దీంతో పోలీసులు బాలిక తండ్రి గురించి ఆరా తీశారు. అతను అక్కడి నుంచి జారుకున్నట్లు నిర్ధారించుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో బాలిక కుటుంబీకులను విచారించడంతో తండ్రే బాలికను గర్భవతిని చేయడంతో, అబార్షన్ చేయించడానికి ఆస్పత్రికి వచ్చినట్లు చెప్పారు. బాలరాజు చెన్నైలో బేల్దారి పనులు చేస్తున్నందున అక్కడికి పారిపోయి ఉంటాడని పోలీసులు గాలిస్తున్నారు. -
నామినేషన్ల దాఖలుకు తెర!
సాక్షి, నెల్లూరు(పొగతోట): సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. నామినేషన్లకు చివరి రోజైన సోమవారం 96 నామినేషన్లు సమర్పించారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. రెండు పార్లమెంట్, 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 173 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నెల్లూరు పార్లమెంట్‌కు 17, తిరుపతి పార్లమెంట్‌కు 16 నామినేషన్లు, పది అసెంబ్లీలకు 140 నామినేషన్లు దాఖలయ్యాయి. నెల్లూరు పార్లమెంట్‌కు కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి ఆర్ ముత్యాలరాజు నామినేషన్లు స్వీకరించారు. తిరుపతి పార్లమెంట్‌కు సంబంధించి జాయింట్ కలెక్టర్ వెట్రిసెల్వి డీఆర్డీఏ పీడీ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించారు. కావలి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు సిటీ, రూరల్, సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, ఉదయగిరి నియోజకవర్గాల్లో ఆర్వోలు నామినేషన్లు స్వీకరించారు. ఈ నెల 18, 19 తేదీల్లో నామినేషన్లు ఎవరూ వేయలేదు. 20న ఆరుగురు నామినేషన్లు వేశారు. ఈ నెల 21వ తేదీ 12, 22వ తేదీ 59 మంది నామినేషన్లు వేశారు. 23, 24వ తేదీలు సెలవులు కావడంతో నామినేషన్లు స్వీకరించలేదు. చివరి రోజు 96 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన, 28న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నిర్వహించనున్నారు. నెల్లూరు పార్లమెంట్‌కు 17 మంది, తిరుపతి పార్లమెంట్‌కు 16 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 15 మంది అభ్యర్థులు, అంతకన్నా ఎక్కువ మంది పోటీలో ఉంటే రెండు ఈవీంఎలు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. నెల్లూరు, తిరుపతి పార్లమెంట్‌కు సంబంధించి 2856 పోలింగ్ కేంద్రాల్లో ఎంపీలకు రెండు ఈవీఎంలు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. అసెంబ్లీకి సంబంధించి నెల్లూరు నియోజకవర్గంలో 20 మంది, ఉదయగిరిలో 18 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నామినేషన్లు వేసిన అభ్యర్థులందరూ పోటీలో ఉంటే పోలింగ్ కేంద్రాల్లో రెండు ఈవీఎంలు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. 28వ తేదీన నామినేషన్ల ఉపసంహరణన తర్వాత ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉంటారో తెలుస్తుంది. 29వ తేదీ తరువాత బరిలో ఉండే పార్టీలకు సంబంధించిన అభ్యర్థులకు పార్టీ గుర్తులు కేటాయిస్తారు. ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తులు కేటాయించనున్నారు. గుర్తులు కేటాయించిన తరువాత బ్యాలెట్ పత్రాన్ని సిద్ధం చేస్తారు. బ్యాలెట్ పత్రంలో గుర్తులతో పాటు అభ్యర్థుల ఫొటో ఉంటుంది. వచ్చే నెల 11న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. -
రైల్లో ఆత్మహత్య చేసుకున్న యువతి గుర్తింపు
సాక్షి, కావలిరూరల్: విజయవాడ నుంచి బిట్రగుంటకు వస్తు న్న ప్యాసింజర్ రైల్లో బుధవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన యువతి నెల్లూరుకు చెం దిన రాసాల నరసింహా రావు కుమార్తె రాసాల స్వాతిశ్రీ (25)గా గుర్తిం చారు. యువతి ఆత్మహత్యపై ‘సాక్షి’లో వచ్చిన ఫొటోతో పాటు ప్రచురితమైన వార్తను చూసి ఆమె కుటుంబ సభ్యులు గుర్తించారు. గురువారం కావలి జీఆర్పీ పోలీసులను సంప్రదించారు. ప్రభుత్వ ఏరియా వైద్యశాల మార్చురీలో ఉన్న యువతి మృతదేహాన్ని చూసి స్వాతిశ్రీగా నిర్ధారించుకున్నారు. స్వాతిశ్రీ తల్లిదండ్రులు ఇద్దరికీ పక్షవాతం ఉండటంతో కుటుంబం ఇబ్బందుల్లో ఉంది. దీంతో బీటెక్ చదువు మధ్యలో ఆపేసింది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ఆమె పోటీ పరీక్షలు రాసేందుకు గత 2 నెలల నుంచి నెల్లూరులోని ఒక కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటుంది. ఈ నెల 9న కోచింగ్ కోసమని ఇం టి నుంచి వచ్చిన ఆమె తిరిగి ఇంటికి వెళ్లలేదు. ఈ క్రమంలో 10న స్వాతిశ్రీ కుటుంబ సభ్యులు నెల్లూరు రెండో నగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 11వ తేదీ రాత్రి ఆమె విజయవాడ–బిట్రగుంట ప్యాసింజర్ రైల్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు ఆమె కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించి, శుక్రవారం స్వాతిశ్రీ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని జీఆర్పీ పోలీసులు తెలిపారు. -
200 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు(కావలి): బియ్యం మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో తహశీల్దార్ సాంబశివరావు ఆధ్వర్యంలో పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు..స్థానిక కేవీఆర్ మిల్లుపై అధికారులు బుధవారం వేకువజామున తనిఖీలు జరిపారు. ఈ సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన 200 బస్తాల రేషన్ బియ్యం బస్తాలు బయటపడ్డాయి. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.