
ఈ మధ్య సెలబ్రిటీలు పెళ్లి, నిశ్చాతార్థం లాంటి వాటితో బిజీ అయిపోతున్నారు. ఈ మధ్య సీరియల్ నటి, బిగ్ బాస్ ఫేమ్ కీర్తి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆమె రూట్ లోనే ప్రముఖ తెలుగు సీరియల్ నటుడు ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. తాజాగా జరిగిన ఈ వేడుకలో డాక్టర్‌బాబు.. అదేనండి నిరూపమ్ తోపాటు పలువురు సందడి చేశారు.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7 'ఉల్టా పల్టా' అసలు మీనింగ్ ఇదేనా!?)
తెలుగు ప్రేక్షకులు సినిమాలని ఎంత ఆదరిస్తారో.. సీరియల్స్‌ని అంతకంటే ఎక్కువగా చూసేస్తుంటారు. అలా ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమైన ముద్దమందారం, ముత్యమంత ముద్దు లాంటి సీరియల్స్‌తో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న కృష్ణా రెడ్డి ప్రస్తుతం పలు సీరియల్స్‌లో నటిస్తున్నాడు. ఇప్పుడు అతడు స్వాతి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. బహుశా ఈ ఏడాదిలోనే పెళ్లి కూడా ఉండొచ్చు. ఈ వేడుకలో పలువురు సీరియల్ స్టార్స్ సందడి చేసి, కొత్త జంటని ఆశీర్వాదించారు.
(ఇదీ చదవండి: సారీ చెప్పిన హీరో లారెన్స్.. ఆ గొడవపై కామెంట్స్!)
Comments
Please login to add a commentAdd a comment