సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: సంగారెడ్డి నియోజకవర్గంలోని 650 మంది ఉద్యోగుల ఓట్లు గల్లంతయ్యాయి. దీంతో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన ఉపాధ్యాయులు తిరిగి తమకు ఓటు వేసే అవకాశాన్ని కల్పిం చాలని కోరుతూ తహశీల్దారు కార్యాలయం ఎదుట శుక్రవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాధారణ ఎన్నికల్లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న తమకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు ఆవకాశం ఇవ్వాలని కోరు తూ గత నెల 25న తహశీల్దారు కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నామన్నారు.
కాగా పోస్టల్ బ్యాలెట్ పేపర్లు అందకపోవడంతో ఉద్యోగులు 4 రోజులుగా కార్యాలయం చుట్టూ తిరిగినా ఎవ రూ పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఈ సమయంలో అసిస్టెంట్ ఎన్నికల అధికారి, తహశీల్దారు కృష్ణారెడ్డి అందుబాటులో లేకపోవ డంతో సంబంధిత ఎన్నికల విభాగం ఇన్‌చార్జి విజయ్‌కుమార్ ఉద్యోగులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. జాబితాలో తమ పేరు లేకపోయినా దరఖాస్తులు ఎక్కడ ఉన్నాయో తెలపాలన్నారు. దీంతో సంబంధిత సెక్షన్ అధికారి అందుబాటులో లేరని తెలపడంతో ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదుచేశారు.
రికార్డు మాయం చేశారు: చంద్రశేఖర్(టీచర్)
పోస్టల్ బ్యాలె ట్ కోసం గత నెల 25న తహశీల్దారు కార్యాలయంలో ఫారం-12 ఫాంతో పాటు ఎన్నికల గుర్తింపు కార్డు, ఎన్నికల విధుల నియామకం ఉత్తర్వుల కాపీని జతచేసి దరఖాస్తు చేసుకున్నామని టీచర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. దర ఖాస్తు చేసుకునే సమయంలో తాను సిబ్బంది ఇచ్చిన రికార్డులో పూర్తి సమాచారంతో నమోదు చేశానని, ఆ రికార్డు ఈ రోజు లేకపోవడమే కాకుండా కొత్త రికార్డులను ఏర్పాటు చేశారని ఆరోపించారు. తమ దరఖాస్తు ఫారాలు సైతం డిలెట్ జాబితాలో, గాని పోస్టల్ బ్యాలె ట్ జాబితాలో గాని తమ పేరు లేదని ఫారాలు సైతం మాయమయ్యాయని పేర్కొన్నారు.
ఎన్నికల అధికారి వివరణ
ఈ విషయంపై నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్‌వీఎంపీఓ యాస్మిన్‌పాషా వివరణ కోరగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మాయమైన విషయం తమకు తెలియదని, దీనిపై తహశీల్దారును విచారణ జరపాలని ఆదేశించినట్లు తెలిపారు. ఉద్యోగులకు ఓటు హక్కు వినియోగించుకోనే ఆవకాశం కల్పించాలని కలెక్టర్ దృష్టికి తీసుకె ళ్లనున్నట్లు తెలిపారు.
650 పోస్టల్ బ్యాలెట్‌లు గల్లంతు
Published Sat, May 10 2014 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 7:08 AM
Advertisement