మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే, ఓటుకు నోట్లు కేసులో ప్రధాన నిందితుడు రేవంత్‌రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి(62) గుండెపోటుతో మృతి చెందారు
మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే, ఓటుకు నోట్లు కేసులో ప్రధాన నిందితుడు రేవంత్‌రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి(62) గుండెపోటుతో మృతి చెందారు. వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలోని తన నివాసంలో సోమవారం ఉదయం కృష్ణారెడ్డికి గుండెపోటు వచ్చింది. ఆయన్ని కుటుంబ సభ్యులు కల్వకుర్తిలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స చేసేలోపే ఆయన మృతి చెందారు. దీంతో ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. కృష్ణారెడ్డి భార్య వనజ గతంలో గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు.