
వివిధ అభివద్ధి పనులకు శ్రీకారం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లాకు రానున్నారు. మధ్యా హ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి.. మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని జిల్లా సమీకత కలెక్టరేట్‌కు చేరుకోనున్నారు. అక్కడ మొక్కలు నాటిన అనంతరం ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రముఖులతో భేటీ కానున్నారు.
ఆ తర్వాత మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించడంతో పాటు వివిధ అభివద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జిల్లా ప్రగతి, వివిధ అభివద్ధి పనుల పురోగతి, సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం తదితర అంశాలపై ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కష్ణారావు, జిల్లా ఇన్‌చార్జి దామోదర రాజనరసింహతో పాటు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారు లతో సమీక్షించనున్నారు. సమావేశం అనంతరం భూత్పూర్ రోడ్‌లోని ఏఎస్‌ఎన్ కన్వెన్షన్ హాల్‌లో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతిని ధులు, మాజీ ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్‌కు తిరిగి బయలుదేరనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment