సాక్షి, పులివెందుల: తాను పారిపోయానంటూ ‘ఈనాడు’ తప్పుడు ప్రచారం చేస్తోందని వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా తాను కాలేజీ పని మీద కడపకు వెళితే.. ఈనాడు పత్రిక వాళ్లు ‘కృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు.. పారిపోయారు’ అంటూ తప్పుడు కథనాలు రాశారని మండిపడ్డారు. సీబీఐ అధికారులు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, ఫోన్ కూడా చేయలేదని తెలిపారు. కాగా, వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: ఆ షాక్ నుంచి జేసీ బ్రదర్స్ ఇంకా తేరుకోలేదా?
Comments
Please login to add a commentAdd a comment