వివేకా హత్యతో లబ్ధి పొందింది సునీత, ఆమె భర్తే  | It was Sunita and her husband who benefited from Vivekas murder | Sakshi
Sakshi News home page

వివేకా హత్యతో లబ్ధి పొందింది సునీత, ఆమె భర్తే 

Published Sat, Sep 2 2023 4:14 AM | Last Updated on Sat, Sep 2 2023 6:31 AM

It was Sunita and her husband who benefited from Vivekas murder - Sakshi

సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యతో లబ్ధి పొందింది ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి మాత్రమేనని వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్‌ యాదవ్‌ తరఫు న్యాయవాది టీఎల్‌ నయన్‌ కుమార్‌ తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. హత్య చేసే కారణం కూడా వారికే ఉందని వివరించారు. వివేకా హత్య వల్ల ఇతరులు పొందే ప్రయోజనం ఏమీ లేదన్నారు. వివేకా ఆస్తులన్నీ సునీత, ఆమె భర్త సొంతమయ్యాయని తెలిపారు. తండ్రి ఆస్తులను దక్కించుకున్న తరువాత సీబీఐ దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా సునీత వ్యవహరిస్తున్నారని వివరించారు.

ప్రతి కోర్టులో, ప్రతి పిటిషన్‌లో ప్రతివాదిగా చేరుతూ (ఇంప్లీడ్‌) పిటిషన్ల మీద పిటిషన్లతో, అవాస్తవాలతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని వివరించారు. ఆమె వాదనలను సీబీఐ న్యాయవాదుల ద్వారా చెప్పిస్తున్నారని తెలిపారు. ఈ కేసులో సునీత బాధితురాలు కాదని... మృతుడు వివేకానందరెడ్డే ఆమె బాధితుడని చెప్పారు. వారి బండారం బయట పడుతుందన్న భయంతోనే ఇంప్లీడ్‌ పిటిషన్లు దాఖలు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం దాఖలు చేసిన ఇంప్లీడ్‌ పిటిషన్‌ సైతం ఆ కోవలోకే వస్తుందన్నారు. అందువల్ల దాన్ని కొట్టేయాలని నయన్‌ కుమార్‌ కోర్టును కోరారు. సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి సహా మరికొందరిపై కడప కోర్టులో ప్రైవేట్‌ ఫిర్యాదు పెండింగ్‌లో ఉందన్నారు.

 2021 ఆగస్టు 2 నుంచి జైలులో ఉన్నానని, చార్జిషీట్‌ కూడా దాఖలు చేసినందున, తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ సునీల్‌ యాదవ్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ కూనూరు లక్ష్మణ్‌ శుక్రవారం విచారణ జరిపారు. నయన్‌ కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. ‘వివేకా హత్య కేసులో కీలక నిందితుడు, కిరాయి హంతకుడు షేక్‌ దస్తగిరి పిటిషన్‌ను తప్ప ఇతర నిందితుల బెయిల్‌ పిటిషన్లను కొట్టివేయాలని సునీత కోర్టులను కోరుతూ వస్తున్నారు. వివేకానందరెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వాంగ్మూలం ఇచ్చి, ఆయన్ని హత్య చేసిన వారిలో తానూ ఉన్నానని చెప్పిన దస్తగిరికి ఆమె సహకరిస్తున్నారు.

అతనికి కింది కోర్టు క్షమాభిక్ష ప్రసాదించడాన్ని, అప్రూవర్‌గా మారేందుకు అనుమతివ్వడంపై సునీత నోరెత్తలేదు. ఆమె న్యాయం కోసం నిష్పాక్షికంగా వ్యవహరించడంలేదు. స్వార్థ ప్రయోజనాల కోసం కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. సమాంతరంగా కేసులను పర్యవేక్షిస్తూ దర్యాప్తులో జోక్యం చేసుకుంటున్నారు. ఒక రకంగా సీబీఐని శాసిస్తున్నారు. దీంతో సీబీఐ దర్యాప్తు సైతం పక్కదారి పట్టింది. అంతేకాకుండా కోర్టులకు నిందితులపై తీవ్ర దురభిప్రాయాన్ని కలిగిస్తూ న్యాయ విచారణ ప్రక్రియను దురి్వనియోగం చేస్తున్నారు’ అని నయన్‌ కుమార్‌ వివరించారు. 

ఆస్తి పోతుందన్న భయం సునీత,నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డిలో పెరిగిపోయింది..
‘తన తండ్రి షేక్‌ షమీమ్‌ అనే మహిళను వివాహం చేసుకున్నారని, వారికి ఒక కొడుకు ఉన్నాడని, వారికి రూ.8 కోట్లు కూడా ఇవ్వాలని తన తండ్రి భావించారని, ఈ కారణంగానే తండ్రితో సత్సంబంధాలు లేవని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో సునీత స్పష్టంగా చెప్పారు. ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి కూడా ఇదే చెప్పారు. ఆస్తి పోతుందన్న భయం సునీత, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డిలలో పెరిగిపోయింది.

రాజశేఖర్‌రెడ్డి, అతని సోదరుడు నర్రెడ్డి శివప్రకాశ్‌ రెడ్డి, మరికొందరు వివేకా హత్యకు కారణమంటూ మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ కడప జిల్లా కోర్టులో ప్రైవేట్‌ ఫిర్యాదు దాఖలు చేశారు. అది పెండింగ్‌లో ఉంది. తులసమ్మ, షేక్‌ షమీమ్‌ మరికొందరు సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం వివేకాను హత్య చేసే కారణం సునీతకు, ఆమె భర్తకే ఉంది. సునీల్‌ యాదవ్‌కు ఈ హత్యతో సంబంధం లేదు. కావాలనే అతన్ని ఇరికించారు.’ అని న్యాయవాది నయన్‌ కుమార్‌ నివేదించారు.  

న్యాయమూర్తిపైనే ఆరోపణలు చేసే స్థాయికి వెళ్లింది.. 
‘నిందితులకు వ్యతిరేకంగా కోర్టులో ప్రతి విచారణకు ఆమె హాజరవుతున్నారు. న్యాయమూర్తి ముందు కూర్చొవడమే కాకుండా తన న్యాయవాదితో వెనక నుంచి చర్చిస్తూ, సూచనలిస్తూ, దర్యాప్తు వివరాలను తానే అందిస్తున్నా అనేలా వ్యవహరిస్తున్నారు. ఈ చర్యల వల్ల.. ఓ వర్గం మీడియా ఏకంగా హైకోర్టు న్యాయమూర్తిపైనే తీవ్రస్థాయి అవినీతి ఆరోపణలు చేసే స్థాయికి వెళ్లింది. ఇదే కేసులో మరో నిందితుడి బెయిల్‌ పిటిషన్‌ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.

సీబీఐ తరఫున వాదించడానికి ఢిల్లీ నుంచి సీనియర్లు వస్తున్నారు. వారికి స్థానిక న్యాయవాదులు, అధికారులు సహకరిస్తున్నారు. సునీత వాదనలు అనవసరం. హత్య జరిగిన రోజున సునీల్‌ యాదవ్‌ ఎక్కడెక్కడికి వెళ్లారో చెప్పేందుకు గూగుల్‌ టేక్‌ అవుట్, దస్తగిరి వాంగ్మూలంపై సీబీఐ ఆధారపడింది. గూగుల్‌ టేక్‌ అవుట్‌లో పేర్కొన్న సమయాలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. దీనిలో తప్పు జరిగిందని సీబీఐ కూడా ఒప్పుకుంది.’ అని నయన్‌కుమార్‌ కోర్టుకు వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి 
విచారణను ఈ నెల 8కి వాయిదా వేశారు.  

కౌంటర్‌ దాఖలు చేయండి
అజేయ కల్లం పిటిషన్‌పై సీబీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశం 
సాక్షి, హైదరాబాద్‌ : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తన వాంగ్మూలాన్ని వక్రీకరించిందని, తాను చెప్పని విషయాలను చెప్పినట్టు చార్జిషీట్‌లో పేర్కొందని, వాటిని చార్జిషీట్‌ నుంచి తొలగించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లం దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు స్పందించింది. ఈ పిటిషన్‌లో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను 15కి వాయిదా వేసింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కూనూరు లక్ష్మణ్‌ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. తాను చెప్పని విషయాలను చెప్పినట్టు సీబీఐ తన చార్జిïÙట్‌లో పేర్కొన్నందున వాటిని చార్జిషీట్‌ నుంచి తొలగించాలంటూ అజేయ కల్లం ఇటీవల తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం శుక్రవారం జస్టిస్‌ లక్ష్మణ్‌ ముందు విచారణకు వచ్చింది. అజేయ కల్లం తరఫున సీనియర్‌ న్యాయ­వాది టి.సూర్యకరణ్‌రెడ్డి, న్యాయవాది పి.వీర్రాజు వాదనలు వినిపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement