కరీంనగర్: లిక్కర్ దందాలో ఆధారాలతోసహా చిక్కిన బీఆర్‌ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితను బీజేపీ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయలేదని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ప్రశ్నించారు. బీఆర్‌ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనన్నారు. సోమవారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో కరీంనగర్ పార్లమెంట్ ని యోజకవర్గ పరిధిలోని జిల్లా, మండల, బ్లాక్, పట్ట ణ, నగర మహిళా విభాగం అధ్యక్షులతో ఆమె వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమీక్షించారు.
బీఆర్‌ఎస్ హయాంలో బీసీలకు జరిగిన అన్యాయంపై కవిత ఎప్పుడూ నోరుమెదపలేదన్నారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహం ఏర్పాటు చేయాలని తన తండ్రి, అప్పటి సీఎం కేసీఆర్‌ను ఎందుకు అడగలేదని నిలదీశారు. తెలంగాణ ఉద్యమంలో కవిత, కేటీఆర్ పాల్గొనలేదని చెప్పారు. బీఆర్‌ఎస్ అంటేనే బందిపోట్ల రాష్ట్ర సమితి అని ధ్వజమెత్తారు. నోట్ల రద్దు చేసి నల్లధనం బయటకు తీసుకువస్తానని చెప్పిన ప్రధాని మోదీ ఏ అకౌంట్‌లోనూ రూ.15 లక్షలు వేయలేదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే బీఆర్‌ఎస్‌కు కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు. ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇచ్చి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారని ఆరో పించారు. ఇన్ని రోజులు బీజేపీ, బీఆర్‌ఎస్ దోచుకొన్న డబ్బును వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖర్చు చేస్తారని అన్నారు. వాళ్లిచ్చిన డబ్బు తీసుకుని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.
అధి ష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా ఆ అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని సూచించారు. ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలన్నారు. జిల్లాలో పార్టీ కమిటీల విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తుంద న్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 17కు కనీసం 15 స్థానాలు సాధించేలా పనిచేయాలని ఆమె కోరారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు చర్ల పద్మ, తాటిపర్తి శోభారాణి, పద్మ, ముద్దం లక్ష్మి, చంద్రకళ, తాటిపర్తి విజయలక్ష్మి, సరళ, నీలం పద్మ తదితరులు పాల్గొన్నారు.
ఇవి చదవండి: మేడిగడ్డకు కేసీఆర్ వస్తానంటే హెలికాప్టర్ సిద్ధం: సీఎం రేవంత్
Comments
Please login to add a commentAdd a comment