తిరుమల: తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో ప్రముఖ నటుడు సాయికుమార్, ప్రముఖ సినీ గాయకులు మనో, సునీత, వందేమాతం శ్రీనివాస్ తదితరులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం వారికి టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.