mano
-
తన బాధలు చెప్పుకున్న సింగర్ మనో..!
-
గరం గరం ముచ్చట్లు 21 August 2021
-
ప్రతి గాయకుడిలో నటుడు ఉంటాడు : సింగర్ మనో
‘‘పాట పాడేటప్పుడు హీరోను ఊహించుకుంటూ ఆ వాయిస్‌లో పాట పాడతాం. అప్పుడే సందర్భానికి తగినట్లు పాట పండుద్ది. అలా ప్రతి గాయకుడిలో నటుడు ఉంటాడు. ఆ గాయకుడికి నటుడిగా అవకాశం దక్కినప్పుడు నిరూపించుకుంటాడు’’ అని గాయకుడు మనో అన్నారు. యాంకర్ శ్రీముఖి, మనో, రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘క్రేజీ అంకుల్స్’. ఇ. సత్తిబాబు దర్శకత్వం వహించారు. గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. మనో మాట్లాడుతూ–‘‘ఓ ఆడది ఓ మగాడు’ సినిమా ద్వారా దాసరిగారు నన్ను బాలనటుడిగా పరిచయం చేశారు. ‘రంగూన్ రౌడీ’, ‘నీడ’, ‘కేటుగాడు’ వంటి చిత్రాల్లోనూ బాలనటుడిగా చేశా. ఇక ‘క్రేజీ అంకుల్స్’ విషయానికొస్తే... ఇందులో బంగారు షాపు యజమాని పాత్ర నాది. తమ భార్యలు తమను సరిగ్గా పట్టించుకోవడం లేదని ముగ్గురు స్నేహితులు భావిస్తారు. ఆ సమయంలో ఓ లేడీ సింగర్‌తో ఏర్పడిన పరిచయం వల్ల వచ్చే సమస్యలేంటి? చివరకు ఎలా బయటపడతారు? అనేదే చిత్రకథ. నాకు కామెడీ పాత్రలంటే ఇష్టం. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యంగార్లలా కామెడీ ప్రధానంగా ఉండే పాత్రలు చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం రెండు, మూడు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది’’ అన్నారు. -
‘పక్క అపార్ట్ మెంట్లో దిగిన గ్లామరస్ అమ్మాయిగా శ్రీముఖి’
యాంకర్ శ్రీముఖి, గాయకుడు మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘క్రేజీ అంకుల్స్’. ఇ. సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో యాంకర్లు ప్రదీప్, అనసూయ బిగ్ టికెట్‌ను విడుదల చేయగా, నిర్మాత కె.ఎస్.రామారావు, రైటర్ కోన వెంకట్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇ. సత్తిబాబు మాట్లాడుతూ.. ‘మా క్రేజీ అంకుల్స్ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుందనేదే ఈ సినిమా. ఈ ముగ్గురితో శ్రీముఖి ఎలాంటి మ్యాచ్ ఆడించిందనేది క్రేజీగా ఉంటుంది. అది సినిమాలో చూడాల్సిందే’ పేర్కొన్నాడు. ఇక శ్రేయాస్ శ్రీను మాట్లాడుతూ.. ‘మా ‘క్రేజీ అంకుల్స్’ రిలీజ్‌కు సపోర్ట్ చేస్తున్న గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్, ‘దిల్’ రాజులకు ధన్యవాదాలు తెలిపాడు. వ్యాపారాలు చేసుకునే ముగ్గురు భర్తలను భార్యలు నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందనే పాయింట్‌తో ఈ సినిమాను సరదాగా తెరకెక్కించామని నిర్మాత శ్రీనివాస్ అన్నాడు. కోన వెంకట్ మాట్లాడుతూ.. నాకు ఎంతో కావాల్సిన అతి కొద్ది మందిలో శ్రీను ఒకడు. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి’ అని పేర్కొన్నాడు. కాగా పక్క అపార్ట్ మెంట్లో దిగిన గ్లామరస్ అమ్మాయిగా శ్రీముఖి కనిపిస్తుండగా, ఆమెను పడేసేందుకు రాజు, రెడ్డి, రావు అనే ముగ్గురు అంకుల్స్ ఎలాంటి తిప్పలు పడుతున్నారనేదే కథ. -
శ్రీముఖి ‘క్రేజీ అంకుల్స్’ విడుదల తేదీ వచ్చేసింది
శ్రీముఖి, మనో, రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘క్రేజీ అంకుల్స్’. ఈ. సత్తిబాబు దర్శకుడిగా వహించిన ఈ సినిమాను బొడ్డు అశోక్ నిర్మిస్తున్నాడు. ఈ నెల 19న ప్రేక్షకులముందుకురానుంది. ఈ నేపథ్యంలో నిర్మాతల్లో ఒకరైన శ్రేయాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. కామెడీ జానర్లో తెరకెక్కిన చిత్రమిది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేద్దామనుకున్నాం. అయితే పెద్ద సినిమాలు ఉండటంతో వాయిదా వేశాం. ఆ తర్వాత మేలో లాక్డౌన్ వచ్చింది. ఫైనల్‌గా ఈ నెలలో రిలీజ్ చేస్తున్నాం. ఇటీవల విడుదల చేసిన మా సినిమా టైటిల్ సాంగ్ మంచి స్పందన వచ్చింది. రఘు కుంచె స్వరపరచిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా.. శ్రీముఖి తన డ్యాన్స్‌తో ఆకట్టుకుంది’ అని చెప్పుకొచ్చాడు. -
పండగకి అంకుల్స్ సందడి
‘ఈ సంక్రాంతికి సినిమా సందడి మొదలవుతోంది. వినోదం పుష్కలంగా ఉన్న ఈ ‘క్రేజీ అంకుల్స్’ బాగా సందడి చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నిర్మాత అచ్చిరెడ్డి. శ్రీముఖి, మనో, రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘క్రేజీ అంకుల్స్’. ఇ. సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ బ్యానర్స్‌పై గుడ్ ఫ్రెండ్స్–బొడ్డు అశోక్ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ని నిర్మాతలు అచ్చిరెడ్డి, యంఎల్ కుమార్ చౌదరి, బెల్లంకొండ సురేశ్ విడుదల చేశారు. ‘‘క్రేజీ అంకుల్స్ ట్రైలర్ ఎంటర్టైనింగ్గా ఉంది. ఈ చిత్రంతో డబ్బులు బాగా వచ్చి మరిన్ని మంచి సినిమాలు తీయాలని మా శ్రీనుని ఆశీర్వదిస్తున్నా’’ అన్నారు నిర్మాత బెల్లంకొండ సురేశ్. ఇ. సత్తిబాబు మాట్లాడతూ– ‘‘ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సినిమా చేస్తున్నప్పుడు మా టీమ్ ఎంత ఎంజాయ్ చేశామో చూస్తున్నపుడు ఆడియన్స్ అంతే ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ‘‘శ్రేయాస్ శ్రీను, నేను ఒక సినిమా చేయాలనుకుంటున్న సమయంలో డార్లింగ్ స్వామి చెప్పిన పాయింట్ నచ్చి ఈ సినిమా నిర్మించాం’’ అన్నారు శ్రీవాస్. సంగీత దర్శకుడు రఘు కుంచె, నటుడు రాజా రవీంద్ర మాట్లాడారు. -
రంజాన్ స్పెషల్.. ఆలయానికి సింగర్!
ప్రముఖ గాయకుడు మనో (నాగూర్ బాబు) పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాల్ ఆలయాన్ని దర్శించారు. ఆలయంలోని స్వామివారి ముందు ‘అదిగో అల్లదిగో శ్రీ హరివాసమూ’ అంటూ గానాలాపన చేసి భక్తి పారవశ్యం చెందారు. తన శ్రీమతి జమీలా బాబుతో కలిసి మతసామరస్యానికి ప్రతీకగా ఆయన వరదరాజ స్వామివారిని దర్శించుకోవటం గమనార్హం. ప్రతి ఏడాది రంజాన్ పండుగను తన నివాసంలో ఎంతో వేడుకగా జరుపుకునే సింగర్ మనో ఈసారి ఆలయాన్ని దర్శించుకుని, స్వామివారి ముందు వేంకటేశ్వరుని భక్తిపారవశ్యంతో కీర్తించటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
తమిళనాడు: వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న సింగర్ మనో
-
శివభక్తి గాన సుధ
శ్రీశైలం: నాగులకట్ట కళావేదికపై బుధవారం రాత్రి కళానీరాజనంలో భాగంగా మనో(నాగుర్బాబు) బృంద సభ్యులు శివభక్తి గాన సుధ కార్యక్రమాన్ని నిర్వహించారు. వక్రతుండ మహాకాయ, గణపతి స్తోత్రంతో ప్రారంభించి.. శివభక్తి గీతాలను ఆలాపించారు. ఈ సందర్భంగా ఈఓ నారాయణభరత్ గుప్త మాట్లాడుతూ.. సాంస్కృతిక వారోత్సవాల్లో భాగంగా దేవస్థానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. భక్తి గానసుధలో మనోతోపాటు పవన్ చరణ్, శ్రీనిధి, కె. లక్ష్మీ కీర్తనలు పాల్గొన్నారు. మనో ఆరెస్ట్రా బృందం వాయిద్య సహకారాన్ని అందించగా, హైదరాబాద్‌కు చెందిన నేతి శ్రీశైలం అండ్ సన్స్ శ్రీస్వామిఅమ్మవార్ల సేవగా వీరు స్పాన్సర్స్‌గా వ్యవహరించినట్లు తెలిపారు. సుమారు గంటకు పైగా సాగిన ఈ కార్యక్రమంలో జేఈఓ హరినాథ్‌రెడ్డి, ఈఈ శ్రీనివాస్, దేవస్థానం వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. నేడు కథక్ నృత్య ప్రదర్శన కళానీరాజనంలో భాగంగా గురువారం రచనా యాదవ్ గురుగాన్.. కథక్ నృత్యప్రదర్శన ఉంటుందని ఈఓ భరత్ గుప్త తెలిపారు. -
శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు
తిరుమల: తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో ప్రముఖ నటుడు సాయికుమార్, ప్రముఖ సినీ గాయకులు మనో, సునీత, వందేమాతం శ్రీనివాస్ తదితరులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం వారికి టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
అక్టోబర్ 26 పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: మనో (సింగర్), అసిన్ (నటి), అమలాపాల్ (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 8. పుట్టిన తేదీ 26. ఇది శనికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల వీరిపై శని ప్రభావం బలంగా ఉంటుంది. ఫలితంగా ఈ సంవత్సరం వీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో స్థిరత్వాన్ని, అభివృద్ధిని పొందుతారు. మనోబలం పెరుగుతుంది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు కోరుకున్న కోర్సులలో సీటు వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం, ఉద్యోగులకు ప్రమోషన్ ఉంటుంది. రాజకీయ నాయకులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఐ.ఎ.ఎస్‌లు, ఐపీఎస్‌లు తదితర అధికారులకు పదోన్నతి ప్రాప్తిస్తుంది. ఈ ఏడాది పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలనిస్తాయి. క్రమశిక్షణ, న్యాయం, ధర్మం, సమానత్వం అనే గుణాలను కలిగి ఉండటం వల్ల సంఘంలో మంచి పేరు తెచ్చుకుంటారు. పిల్లలకు వివాహాది శుభకార్యాలు జరిపిస్తారు. న్యాయవాద వృత్తిలో ఉన్న వారు, మేనేజిమెంట్ రంగంలోని వారు రాణిస్తారు. అయితే బీపీ, హృద్రోగాలు తలెత్తే అవకాశం ఉన్నందువల్ల అప్రమత్తంగా ఉండటం మంచిది. లక్కీ డేస్: 1,3,8,9; లక్కీ కలర్స్: ఎల్లో, గోల్డెన్, బ్లూ, బ్లాక్; లక్కీ డేస్: గురు, శుక్ర, శనివారాలు. సూచనలు: శనికి తైలాభిషేకం, శివునికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం, అనాథలకు అన్నదానం, వృద్ధులను ఆదరించడం, పిల్లులకు, కుక్కలకు ఆహారం పెట్టడం, మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్త్రో న్యూమరాలజిస్ట్ -
మనోల్లాసం
ఆయన పాటందుకుంటే అల్లరి ఉంటుంది. పద్యం అందుకున్నాడంటే ఆ ప్రవాహం ఆపడం ఎవరి తరం కాదు. తెలుగునాట తన గాత్రంతో ట్రెండ్ సెట్టర్‌గా మారిన మనోకు ఉగాది అంటే మనోల్లాసంగా జరుపుకునే వేడుక. షడ్రుచుల ఉగాది పచ్చడి జీవిత సత్యాన్ని తెలియజేస్తుందంటున్న మనోతో ‘సిటీప్లస్’ ఉగాది ముచ్చట్లు. ..:: భువనేశ్వరి నాకప్పుడు ఏడేళ్లు. ఓ పండుగపూట అమ్మ అన్నయ్యలకు చిన్న చిన్న గిన్నెల్లో ఏదో స్వీటు పెట్టి ఇచ్చింది. నాకివ్వలేదు. అమ్మ వంటింట్లో లేని సమయంలో మెల్లిగా వెళ్లి ఆ స్వీటు ఉన్న గిన్నె ఎక్కడ పెట్టిందో వెతికాను. ఇంతలో రెండు గిన్నెలు పడి పెద్ద శబ్దం వచ్చింది. అమ్మ వచ్చేలోపు ఆ గిన్నె అందుకుని బయటకు పరిగెత్తాను. చేతికి వచ్చినంత తీసుకుని నోట్లో వేసుకున్నాను. అయ్య బాబోయ్.. చేదు! దెబ్బకు ఆ గిన్నె అక్కడే పడేసి అమ్మ దగ్గరికెళ్లి ఆ చేదు తగ్గడానికి ఏదైనా తీపి పెట్టమని అడిగితే పావలా చేతిలో పెట్టింది. వెంటనే కిరాణా కొట్టుకెళ్లి పిప్పరమెంటు కొనుక్కుని నోట్లో వేసుకున్నాను. బుల్లిబాబు... ‘ఇంత చేదుగా ఉన్నదాన్ని అంత ఇష్టంగా ఎలా తింటున్నారమ్మా?’ అని అడిగితే.. ‘అది ఉగాది పచ్చడిరా.. తీపి, పులుపు, చేదు, వగరు, కారం, ఉప్పు.. జీవితం అంటే షడ్రుచుల సమ్మేళనం. ఈ ఆరు రుచులను ఒకే విధంగా ఆస్వాదించడమే జీవిత సత్యం’ అంటూ అమ్మ చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి. నేను పుట్టింది, పెరిగింది సత్తెనపల్లిలో.. నాకు ఆరేళ్లుండగా విజయవాడకు మకాం మార్చాం. నాన్న రసూల్ హార్మోనిస్టు, అమ్మ షహీబా పౌరాణిక డ్రామా ఆర్టిస్టు. చింతామణి, సత్యభామ పాత్రలు బాగా చేసేది. ఇద్దరు అన్నయ్యలు, ఒక అక్క. నేనే చిన్నోణ్ని. ఇంట్లో అందరూ ముద్దుగా బుల్లిబాబు అనేవారు. అమ్మ ఇంకొంచెం ముద్దుగా ‘బుల్లోడా..’ అని పిలిచేది. మొదటిసారి ఉగాది పచ్చడి తిన్నప్పుడు ‘ఇంత ప్రేమగా పిలిచే అమ్మ ఇంత చేదు స్వీటు ఎలా చేసిందబ్బా’ అని అనుకున్నా. (నవ్వుతూ...). ఆ రుచుల విలువ... నాకు చిన్నప్పుడే చేదు, తీపిల గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. పద్నాలుగేళ్ల వయసులో మద్రాసు వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాను. చిన్న చిన్న చాన్సులు.. ఒక రోజు ఇరవై రూపాయలు.. ఇంకో రోజు ముప్పయ్.. సంపాదించి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో నాకు చేదు వెనుకున్న తీపి ఎలా ఉంటుందో తెలిసింది. ఒక్కోరోజు 22 గంటలు పనిచేసిన సందర్భాలున్నాయి. తక్కువ సమయంలోనే గురువు చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంటు ఉద్యోగం సంపాదించుకున్నాను. పిల్లాడు దారిలో పడ్డాడు అనుకున్నారో ఏమో.. అమ్మానాన్న నాకు ఇరవై ఏళ్లకే పెళ్లి చేసేశారు. దాంతో ఇంకాస్త బాధ్యత పెరిగింది. నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నదేంటంటే.. కుటుంబం, వృత్తి పట్ల బాధ్యతగా మసులుకునే వారికి షడ్రుచుల విలువ త్వరగా తెలుస్తుంది. గురువుగారింట్లో.. మా ఇంట్లో అన్ని పండుగలూ గ్రాండ్‌గా చేస్తారు. సంక్రాంతి నుంచి శ్రీరామనవమి వరకూ అన్నీ చాలా శ్రద్ధగా చేస్తారు. ఉగాది పచ్చడి స్పెషల్ ఏంటంటే.. ఆ రోజంతా ఇంటికి వచ్చినవారికి ప్రేమగా పచ్చడి పెట్టడం. ఆ తర్వాత ఆ ప్రేమను చక్రవర్తిగారింట్లో చూశాను. ఆయన దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసే రోజుల్లో ఉగాది రోజున ఇంటికి పిలిచి పచ్చడి పెట్టి, భోజనం పెట్టించి బట్టలు పెట్టి పంపేవారు. నాకే కాదు.. ఆయన దగ్గర పనిచేస్తున్న ప్రతిఒక్కరికి పెట్టేవారు. ఇన్నేళ్లలో చాలామంది మిత్రుల ఇళ్లలో పచ్చడి తిన్నాను. ముఖ్యంగా కమలహాసన్, రజనీకాంత్ ఇళ్లలో. వారి ప్రత్యేకత ఏంటంటే.. వారి పండగ కాకపోయినా ఈ రోజున ప్రత్యేకంగా పచ్చడి చేయించి ఇంటికి వచ్చిన వారందరికీ పెట్టేవారు. ఎందుకంటే వాళ్లు పొద్దునలేచి పనిచేసేది తెలుగువారితోనే కదా! దాంతో మిగతా పండుగలు ఎలా ఉన్నా ఉగాది రోజు పచ్చడి సందడి చాలా ఉండేది. కొందరు తెలియనివారు మాలాంటి వారిని అడిగిమరీ తెలుసుకుని పచ్చడి తయారు చేయించేవారు. అమ్మచేతి పచ్చడి... మా అమ్మగారు కళాకారిణిగా ఎంత బిజీగా ఉన్నా.. వంట విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యేవారు కాదు. ఆమె వంటలు చాలా రుచిగా ఉండేవి. పచ్చడి ఎవరూ చేసినా చేదుగానే ఉంటుందనుకోండి. కానీ అమ్మ చేతి పచ్చడి కొంచెం డిఫరెంట్. ఇప్పుడు నా భార్య జమీలా కూడా అమ్మలాగే ఉగాది రోజు చాలా హడావిడి చేస్తుంది. ఇంటికొచ్చినవారికి పచ్చడి పెట్టకుండా పంపదు. మిగతా పండుగలన్నీ మనకు సంతోషాన్ని పంచేవైతే ఈ పండగ సంతోషంతో పాటు జీవిత సత్యాన్ని కూడా తెలుపుతుంది. -
మనోతో లెజెండ్స్