
ప్రముఖ గాయకుడు మనో (నాగూర్ బాబు) పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాల్ ఆలయాన్ని దర్శించారు. ఆలయంలోని స్వామివారి ముందు ‘అదిగో అల్లదిగో శ్రీ హరివాసమూ’ అంటూ గానాలాపన చేసి భక్తి పారవశ్యం చెందారు. తన శ్రీమతి జమీలా బాబుతో కలిసి మతసామరస్యానికి ప్రతీకగా ఆయన వరదరాజ స్వామివారిని దర్శించుకోవటం గమనార్హం. ప్రతి ఏడాది రంజాన్ పండుగను తన నివాసంలో ఎంతో వేడుకగా జరుపుకునే సింగర్ మనో ఈసారి ఆలయాన్ని దర్శించుకుని, స్వామివారి ముందు వేంకటేశ్వరుని భక్తిపారవశ్యంతో కీర్తించటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.