రంజాన్‌కు భారీ బందోబస్తు | Huge Provision In Hyderabad In Honor Of Ramzan | Sakshi
Sakshi News home page

రంజాన్‌కు భారీ బందోబస్తు

Published Mon, May 2 2022 8:59 AM | Last Updated on Mon, May 2 2022 8:59 AM

Huge Provision In Hyderabad In Honor Of Ramzan - Sakshi

సాక్షి హైదరాబాద్‌: రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం పలు ప్రాంతాల్లో ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు విభాగం పటిష్ట బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 7 నుంచి 11:30 గంటల వరకు నిర్ణీత ప్రాంతాల్లో, నిర్ణీత సమయాల్లో అమలులో ఉంటాయని తెలిపారు. ఈ ఆంక్షలు ఆర్టీసీ బస్సులకు సైతం వర్తిస్తాయని ఆయన స్పష్టం చేశారు.  

మీరాలం ఈద్గా వద్ద.. 

  • ఈద్గా మీరాలం ట్యాంక్‌ వైపు ప్రార్థనల కోసం వచ్చే వాహనాలను పురానాపూల్, కామాటిపు రా, కిషన్‌బాగ్, బహదూర్‌పురా చౌరస్తా మీదుగా పంపిస్తారు. సాధారణ వాహనాలను బహదూర్‌పురా చౌరస్తా నుంచి కిషన్‌బాగ్, కామాటిపురా వైపు మళ్లిస్తారు. 
  • సైకిళ్లు, రిక్షాలను ఈద్గా క్రాస్‌ రోడ్స్‌ దాటి రానివ్వరు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాండ్స్‌లో వీటిని ఆపుకోవాలి. 
  • శివరాంపల్లి, నేషనల్‌ పోలీసు అకాడమీ వైపు నుంచి బహదూర్‌పురా వచ్చే ట్రాఫిక్‌ను ధనమ్మ గుడిసెలున్న టీ–జంక్షన్‌ నుంచి ఆలియాబాద్, తాడ్‌బండ్, బాయిస్‌ టౌన్‌ హైస్కూల్‌ మీదుగా పంపిస్తారు. 
  • ప్రార్థనల అనంతరం వేగంగా ప్రయాణించే వాహనాలను పునారాపూల్, సిటీ కాలేజ్‌ మీదుగా పంపుతారు. 
  • మాసబ్‌ట్యాంక్‌ హాకీ గ్రౌండ్స్‌ వద్ద.. 
  • మెహిదీపట్నం నుంచి బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 1 వైపు వచ్చే సాధారణ వాహనాలు అయోధ్య, ఖైరతాబాద్, ఆర్టీఏ ఆఫీస్, తాజ్‌కృష్ణా మీదుగా వెళ్లాలి. 
  • బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12 నుంచి మాసబ్‌ట్యాంక్‌ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను తాజ్‌కృష్ణా, ఎన్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్‌ మీదుగా మళ్లిస్తారు. 
  • లక్టీకాపూల్‌ నుంచి రోడ్‌ నంబర్‌ 1/12 వైపు వచ్చే ఆర్టీసీ బస్సులను అయోధ్య, నిరంకారి, చింతల్‌బస్తీ మీదుగా పంపిస్తారు. 

(చదవండి: నైట్‌ బజార్‌.. ఫుల్‌ హుషార్‌.)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement