ramzan day
-
కన్నకొడుకుని హతమార్చిన 90 ఏళ్ల వృద్ధుడు
గుంతకల్లు: ‘ఎంత వరకు ఓపిక పట్టాలి. ఎంతగా నచ్చచెప్పినా మారలేదు. ప్రతిరోజూ నాకు నరకమే చూపాడు. నాకున్న ఆరుగురు కుమారుల్లో ఎవరూ ఇంతగా సతాయించలేదు. ఏం చేయమంటారు? మనశ్శాంతి కోసం వాడు చచ్చేదాకా ఇనుప రాడ్‌తో తలపై పలుమార్లు బలంగా బాదాను’ అంటూ పోలీసుల ఎదుట 90 ఏళ్ల వృద్ధుడు కన్నీటి పర్యంతమయ్యాడు. కుమారుడి వేధింపులు తాళలేక చివరకు హతమార్చాల్సి వచ్చిందంటూ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. గుంతకల్లు డీఎస్పీ నర్సింగప్ప తెలిపిన మేరకు.. మద్యానికి బానిసగా మారి.. గుంతకల్లులోని ఎస్ఎల్వీ థియేటర్ వెనుక ఉన్న యల్లమ్మ తగ్గు ప్రాంతంలో నివాసముంటున్న షేక్ జాఫర్‌సాహెబ్‌కు ఆరుగురు కుమారులు సంతానం. వీరిలో ఐదో కుమారుడు షేక్ ఖలీల్‌కు కొన్నేళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. తాగుడుకు బానిసైన ఖలీల్ వేధింపులు తాళలేక మూడేళ్ల క్రితం అతని భార్య విడాకులు తీసుకుని పిల్లలతో కలిసి విడిపోయింది. అప్పటి నుంచి తండ్రి వద్దనే ఖలీల్ ఉంటున్నాడు. ఎలాంటి పనీపాట లేకుండా మద్యం మత్తులోనే జోగుతుండేవాడు. వృద్ధాప్యంలో శరీరం సహకరించకపోయినా.. కూలి పనులతో కుటుంబ పోషణ భారాన్ని జాఫర్ సాహెబ్ మోస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాగుడుకు డబ్బు ఇవ్వాలంటూ తరచూ తండ్రిని ఖలీల్ వేధించేవాడు. డబ్బు లేదని చెబితే నడిరోడ్డుపై కేకలు వేస్తూ ఇరుగూపొరుగు వారితో గొడవకు దిగేవాడు. వేధింపులు తాళలేక.. మంగళవారం రంజాన్ పండుగను ఉన్నంతలో గొప్పగా చేయాలని తండ్రి భావించాడు. దాచుకున్న డబ్బు తీసి వంట సరుకులు కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యాడు. తండ్రి చేతిలో డబ్బు చూసిన ఖలీల్ తనకు ఇవ్వాలని గొడవపడ్డాడు. ఎంతగా నచ్చచెప్పినా వినలేదు. మాటలతో దూషించాడు. అసహాయుడైన వృద్ధుడిపై దాడి చేసేందుకూ వెనుకాడలేదు. దీంతో జాఫర్‌సాహెబ్‌లో ఓపిక నశించింది. ఇక కుమారుడు జీవించి ఉన్నంత కాలమూ తనకు మనశ్శాంతి ఉండదని భావించాడు. మధ్యాహ్నం నిద్రిస్తున్న కుమారుడిపై ఇనుపరాడ్‌తో దాడి చేశాడు. శరీరంలో శక్తినంతటినీ కూడదీసుకుని పలుమార్లు తలపై బలంగా మోదడంతో ఖలీల్ (36) అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు పోలీసు స్టేషన్‌కు చేరుకుని జరిగిన వృత్తాంతాన్ని పోలీసులకు జాఫర్‌సాహెబ్ వివరించాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ నర్సింగప్ప, రెండో పట్టణ సీఐ చిన్నగోవిందు, ఎస్ఐ నరేంద్ర అక్కడకు చేరుకుని పరిశీలించారు. నిందితుడు తెలిపిన మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. (చదవండి: వదినతో గొడవ.. పల్సర్ బైకుకు నిప్పు.. ఆపై పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి..) -
రంజాన్‌కు భారీ బందోబస్తు
సాక్షి హైదరాబాద్: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం పలు ప్రాంతాల్లో ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు విభాగం పటిష్ట బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 7 నుంచి 11:30 గంటల వరకు నిర్ణీత ప్రాంతాల్లో, నిర్ణీత సమయాల్లో అమలులో ఉంటాయని తెలిపారు. ఈ ఆంక్షలు ఆర్టీసీ బస్సులకు సైతం వర్తిస్తాయని ఆయన స్పష్టం చేశారు. మీరాలం ఈద్గా వద్ద.. ఈద్గా మీరాలం ట్యాంక్ వైపు ప్రార్థనల కోసం వచ్చే వాహనాలను పురానాపూల్, కామాటిపు రా, కిషన్‌బాగ్, బహదూర్‌పురా చౌరస్తా మీదుగా పంపిస్తారు. సాధారణ వాహనాలను బహదూర్‌పురా చౌరస్తా నుంచి కిషన్‌బాగ్, కామాటిపురా వైపు మళ్లిస్తారు. సైకిళ్లు, రిక్షాలను ఈద్గా క్రాస్ రోడ్స్ దాటి రానివ్వరు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాండ్స్‌లో వీటిని ఆపుకోవాలి. శివరాంపల్లి, నేషనల్ పోలీసు అకాడమీ వైపు నుంచి బహదూర్‌పురా వచ్చే ట్రాఫిక్‌ను ధనమ్మ గుడిసెలున్న టీ–జంక్షన్ నుంచి ఆలియాబాద్, తాడ్‌బండ్, బాయిస్ టౌన్ హైస్కూల్ మీదుగా పంపిస్తారు. ప్రార్థనల అనంతరం వేగంగా ప్రయాణించే వాహనాలను పునారాపూల్, సిటీ కాలేజ్ మీదుగా పంపుతారు. మాసబ్‌ట్యాంక్ హాకీ గ్రౌండ్స్ వద్ద.. మెహిదీపట్నం నుంచి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 వైపు వచ్చే సాధారణ వాహనాలు అయోధ్య, ఖైరతాబాద్, ఆర్టీఏ ఆఫీస్, తాజ్‌కృష్ణా మీదుగా వెళ్లాలి. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 నుంచి మాసబ్‌ట్యాంక్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను తాజ్‌కృష్ణా, ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ మీదుగా మళ్లిస్తారు. లక్టీకాపూల్ నుంచి రోడ్ నంబర్ 1/12 వైపు వచ్చే ఆర్టీసీ బస్సులను అయోధ్య, నిరంకారి, చింతల్‌బస్తీ మీదుగా పంపిస్తారు. (చదవండి: నైట్ బజార్.. ఫుల్ హుషార్.) -
ఆ అమ్మాయి అమాయకురాలు!
లక్నో: ముస్లింలకు ఎంతో పవిత్రమైన ఈద్ అల్ ఫితర్(రంజాన్) రోజున ఓ యువతి వరుసబెట్టి కౌగిలింతలు ఇచ్చి వార్తల్లో నిలిచింది. ఈ సంఘటనపై తీవ్ర దుమారం చెలరేగింది. ఇది ఇస్లాం సంప్రదాయానికి వ్యతిరేకమని కొందరు మత పెద్దలు విమర్శించారు. దీంతో మొరదాబాద్ జిల్లా ఇమామ్ మౌలానా ముఫ్తీ మొహమద్ రంగంలోకి దిగారు. ‘మేం ఆ యువతితో మాట్లాడాం. ఆ యువతి చేసిన చర్య పట్ల అసహనం వ్యక్తం చేశాం. అయితే అమాయకత్వంతో తెలీకుండానే ఆమె అలా చేసింది. ఇలాంటి చర్యలను ఇస్లాం అంగీకరించదు. ఇదే విషయాన్ని ఆమెకు వివరించి .. మరోసారి పునరావృతం కాకుండా జాగ్రత్త ఉండాలని చెప్పాం’ అని మౌలానా మీడియాకు వివరించారు. మరోవైపు ఆ యువతితో అలింగనంలో పాల్గొన్న వారిపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. షరియత్ చట్టాలను అతిక్రమించారని, ఇంకోసారి ఇలాంటి జరిగితే ఉపేక్షించబోమని వారిని ఆయన హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఈ నెల 16న రంజాన్ పర్వదినం సందర్భంగా ఓ యువతి నగరంలోని ఓ షాపింగ్ మాల్ దగ్గరకు వచ్చింది. అనంతరం మాల్ ఎదుట నిల్చోని యువకులకు ఆత్మీయ ఆలింగనం ఇవ్వడం మొదలుపెట్టింది. ఓ అమ్మాయి స్వయంగా అలాంటి అవకాశం ఇస్తుంటే యువకులు చూస్తూ ఉండిపోతారా..? యువతి హగ్ కోసం పోటీ పడ్డారు. సుమారు అరగంటపాటు చాలా మంది యువకులకు ఆ యువతి ఆత్మీయ ఆలింగనం చేసింది. ఆమెతోపాటు వచ్చిన మరో ఇద్దరు యువతుల యువకుల సంఖ్యను లెక్కపెడుతూ.. పెద్దగా కేకలు పెట్టారు. దీన్నంతటిని అక్కడున్న కొంత మంది మొబైల్ ఫోన్లలో బంధించారు. 50 మందిని కౌగిలించుకున్న ఆ యువతి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. -
ఆమె హగ్ కొసం పోటీ పడ్డారు..!
-
వామ్మో.. వరుసబెట్టి హగ్ ఇచ్చిన యువతి.!
లక్నో: రంజాన్ సందర్భంగా ఆలింగనాలు చేసుకోవడం సాధారణమే. అయితే దానిని మగవారు మాత్రమే చేసుకుంటారు. ముస్లిం సాప్రదాయం ప్రకారం ఆ వర్గానికి చెందిన మహిళలు తెలియని వారికి ఆలింగనాలు ఇవ్వడం చాలా తప్పు. అయితే వీటికి భిన్నంగా చేసి ఓ అమ్మాయి మాత్రం అందరిని షాక్‌కి గురిచేస్తూ ఏకంగా 50మందికి పైగా వరుసబెట్టి హగ్ ఇచ్చింది. ఇలా హగ్ ఇస్తున్న అమ్మాయిని చూసి అబ్బాయిలు క్యూ కట్టారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో ఈ నెల 16న రంజాన్ పర్వదినం సందర్భంగా ఓ యువతి నగరంలోని ఓ షాపింగ్ మాల్ దగ్గరకు వచ్చింది. అనంతరం మాల్ ఎదుట నిల్చోని యువకులకు ఆత్మీయ ఆలింగనం ఇవ్వడం మొదలుపెట్టింది. ఓ అమ్మాయి స్వయంగా అలాంటి అవకాశం ఇస్తుంటే యువకులు చూస్తూ ఉండిపోతారా..? యువతి హగ్ కోసం పోటీ పడ్డారు. సూమారు అరగంటపాటు చాలా మంది యువకులకు ఆ యువతి ఆత్మీయ ఆలింగనం చేసింది. ఆమెతోపాటు వచ్చిన మరో ఇద్దరు యువతుల యువకుల సంఖ్యను లెక్కపెడుతూ.. పెద్దగా కేకలు పెట్టారు. దీన్నంతటిని అక్కడున్న కొంత మంది మొబైల్ ఫోన్లలో బంధించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే ఆ యువతి ఎవరనే అనే విషయం తెలియదు. -
రంజాన్ స్పెషల్.. ఆలయానికి సింగర్!
ప్రముఖ గాయకుడు మనో (నాగూర్ బాబు) పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాల్ ఆలయాన్ని దర్శించారు. ఆలయంలోని స్వామివారి ముందు ‘అదిగో అల్లదిగో శ్రీ హరివాసమూ’ అంటూ గానాలాపన చేసి భక్తి పారవశ్యం చెందారు. తన శ్రీమతి జమీలా బాబుతో కలిసి మతసామరస్యానికి ప్రతీకగా ఆయన వరదరాజ స్వామివారిని దర్శించుకోవటం గమనార్హం. ప్రతి ఏడాది రంజాన్ పండుగను తన నివాసంలో ఎంతో వేడుకగా జరుపుకునే సింగర్ మనో ఈసారి ఆలయాన్ని దర్శించుకుని, స్వామివారి ముందు వేంకటేశ్వరుని భక్తిపారవశ్యంతో కీర్తించటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
పండుగపూట విషాదం
పరిగి, న్యూస్‌లైన్: రంజాన్ పర్వదినం.. ఆ కుటుంబమంతా ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకొంది. పిల్లలు సహా తండ్రి ఈద్గాకు వెళ్లి నమాజు చేసి వచ్చారు. కానీ అంతలోనే విధి ఆ బాలుడిని కాటేసింది. గుంత రూపంలో మృత్యువు కబళించింది. అప్పటిదాకా ఆనందంగా ఉన్న ఆ కుటుంబం విషాదంలో మునిగింది. పరిగి మండలం సుల్తాన్పూర్ సమీపంలో శుక్రవారం సాయంత్రం గుంతలో పడి ఓ బాలుడు మృతిచెందిన విషాదకర సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబీకుల కథనం ప్రకారం వివరాలు.. దోమ మండల పరిధిలోని ఐనాపూర్ గ్రామానికి చెందిన మహ్మద్ జహంగీర్ లారీ డ్రైవర్. ఆయనకు ఆరో తరగతి చదువుతున్న సోను(11), కూతుళ్లు అఫ్రిన్ (15), తబసుం(14), సోని(9) సంతానం. ఇటీవల పరిగి మండలం సుల్తాన్పూర్ గేట్ సమీపంలో స్థలం కొనుగోలు చేసి అక్కడే ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు. పిల్లలను పరిగిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నారు. శుక్రవారం రంజాన్ పండుగ ఉండటంతో జహంగీర్ తన కుమారుడు సోనుతో కలిసి పరిగిలోని ఈద్గాకు వెళ్లి ప్రార్థనలు చేసి వచ్చారు. మధ్యాహ్నం తర్వాత సోను స్థానిక కుంట సమీపంలోని పొదల్లోకి బహిర్భూమికి వెళ్లాడు. ఎంతసేపటికీ తిరికి రాకపోవటంతో కుమారుడి కోసం తల్లి వెతకసాగింది. కుంట ఒడ్డున సోను నీళ్లు తీసుకువె ళ్లిన డబ్బా, ఓ చెప్పు కనిపించింది. విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. సమీప పొలాల రైతులు, గ్రామస్తులతో కలిసి కుంటలో వెతికారు. ఈక్రమంలో సాయంత్రం సోను మృతదేహం కుంటలో కనిపించింది. దీంతో జహంగీర్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుంట లోతు మామూలుగానే ఉన్నప్పటికీ అందులో జేసీబీలతో మట్టి తవ్వకాలు అక్రమంగా జరపటంతో దాదాపు 10 మీటర్ల మేర గుంతలు ఏర్పడి నీళ్లు నిలిచాయి. ఆ గుంతలే బాలుడిని బలిగొన్నాయని గ్రామస్తులు చెప్పారు. సుల్తాన్పూర్ శివారులోనే మరో చోట జేసీబీ గుంతల్లోనూ గతంలో ఓ బాలుడు పడి మృతిచెందినట్లు గ్రామస్తులు చెప్పారు.