వామ్మో.. వరుసబెట్టి హగ్‌ ఇచ్చిన యువతి.! | Teen Girl Gives Hugs to Boys | Sakshi
Sakshi News home page

వామ్మో.. వరుసబెట్టి హగ్‌ ఇచ్చిన యువతి.!

Published Wed, Jun 20 2018 4:26 PM | Last Updated on Fri, Jul 12 2019 3:37 PM

Teen Girl Gives Hugs to Boys - Sakshi

లక్నో: రంజాన్‌ సందర్భంగా ఆలింగనాలు చేసుకోవడం సాధారణమే. అయితే దానిని మగవారు మాత్రమే చేసుకుంటారు. ముస్లిం సాప్రదాయం ప్రకారం ఆ వర్గానికి చెందిన మహిళలు తెలియని వారికి ఆలింగనాలు ఇవ్వడం చాలా తప్పు. అయితే వీటికి భిన్నంగా చేసి ఓ అమ్మాయి మాత్రం అందరిని షాక్‌కి గురిచేస్తూ ఏకంగా 50మందికి పైగా వరుసబెట్టి హగ్‌ ఇచ్చింది. ఇలా హగ్‌ ఇస్తున్న అమ్మాయిని చూసి అబ్బాయిలు క్యూ కట్టారు. 

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో ఈ నెల 16న రంజాన్‌ పర్వదినం సందర్భంగా ఓ యువతి నగరంలోని ఓ షాపింగ్‌ మాల్‌ దగ్గరకు వచ్చింది. అనంతరం మాల్‌ ఎదుట నిల్చోని యువకులకు ఆత్మీయ ఆలింగనం ఇవ్వడం మొదలుపెట్టింది. ఓ అమ్మాయి స్వయంగా అలాంటి అవకాశం ఇస్తుంటే యువకులు చూస్తూ ఉండిపోతారా..? యువతి హగ్‌ కోసం పోటీ పడ్డారు. సూమారు అరగంటపాటు చాలా మంది యువకులకు ఆ యువతి ఆత్మీయ ఆలింగనం చేసింది. ఆమెతోపాటు వచ్చిన మరో ఇద్దరు యువతుల యువకుల సంఖ్యను లెక్కపెడుతూ.. పెద్దగా కేకలు పెట్టారు. దీన్నంతటిని అక్కడున్న కొంత మంది మొబైల్‌ ఫోన్లలో బంధించారు. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే ఆ యువతి ఎవరనే అనే విషయం తెలియదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement