Singer Sunitha Shares Her Best Friend Pics In Instagram Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Who Is Singer Sunitha Bestfriend: సింగర్ సునీత.. బెస్ట్ ఫ‍్రెండ్‌ ఎవరో చెప్పేసిందిగా!

Jul 9 2023 9:14 PM | Updated on Jul 10 2023 9:25 AM

Singer Sunitha Shares Her Best Friend Pics In Instagram Goes Viral - Sakshi

సింగర్ సునీత టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. తన మధురమైన స్వరంతో సినీ ప్రేక్షకులను అలరించింది. టాలీవుడ్‌లో స్టార్ సింగర్‌గా పేరు సంపాదించుకున్నారు. పలు చిత్రాలకు పాటలు పాడిన సునీత తెలుగు వారి గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. సునీత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. తాజాగా ఆమె తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. 

(ఇది చదవండి: హీరోగా సింగర్ సునీత కొడుకు.. ఫస్ట్ లుక్ రిలీజ్)

ఆమె ఇన్‌స్టా స్టోరీస్‌లో బెస్ట్ ఫ్రెండ్‌ ఎవరో చెప్పేసింది. స్టార్ యాంకర్‌ సుమతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. తన బెస్ట్ ఫ్రెండ్ యాంకర్‌ సుమ అంటూ ఆమెతో ఉన్న క్షణాలను గుర్తు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. సింగర్ సునీత కూమారుడు సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. 

కాగా.. 'సర్కారు నౌకరి' పేరుతో తీస్తున్న ఈ సినిమాతో ఆకాశ్ హీరోగా పరిచయమవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు.. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. భావన అనే అమ్మాయి హీరోయిన్ గా నటిస్తోంది.

(ఇది చదవండి: లైవ్‌లో సిగరెట్ తాగిన స్టార్ హీరో.. మండిపడుతున్న నెటిజన్స్!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement