
సునీత, గంగనమోని శేఖర్, రాఘవేంద్రరావు, రామ్
ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘సర్కారు నౌకరి’. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా భావనా వళపండల్ హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. ఆర్‌కే టెలీ షో బ్యానర్‌పై దర్శకుడు కె. రాఘవేంద్రరావు నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దేవుని పటాలపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ప్రసాద్ నిమ్మకాయల కెమెరా స్విచ్చాన్ చేయగా, కె. రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు.
మ్యాంగో మీడియా అధినేత, సునీత భర్త రామ్ వీరపనేని గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం హీరోహీరోయిన్లపై తీసిన సీన్‌కి గాయని సునీత కెమెరా స్విచ్చాన్ చేయగా, రాఘవేంద్రరావు క్లాప్ ఇవ్వడంతో ΄ాటు దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 6న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తాం. ఈ చిత్రానికి సంగీతం: శాండిల్య, నిర్మాణం: ఆర్‌కే టెలీషో ప్రైవేట్ లిమిటెడ్, కెమెరా, రచన, దర్శకత్వం: గంగనమోని శేఖర్.
Comments
Please login to add a commentAdd a comment