సాక్షి, హైదరాబాద్: సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. వివేకా హత్య కేసులో స్టేట్‌మెంట్‌ను సీబీఐ రికార్డు చేసింది. సుమారు 3 గంటల పాటు సీబీఐ అధికారులు విచారించారు. రెండోసారి సీబీఐ విచారణకు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి హాజరయ్యారు.
కాగా, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు కాల పరిమితిని సుప్రీంకోర్టు పొడిగించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల 30వ తేదీతో గడువు ముగియనుండగా తాజాగా జూన్ 30 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు వెలువరించిన సంగతి తెలిసిందే.
అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు(బుధవారం) వాదనలు వింటామని తెలంగాణ హైకోర్టు పేర్కొంది.
చదవండి: వివేకా హత్య కేసు: కుట్రదారులతో కుమ్మక్కు
Comments
Please login to add a commentAdd a comment