
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డిని సీబీఐ విచారించింది. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో శనివారం రెండు గంటల పాటు సీబీఐ అధికారులు రాజశేఖర్‌రెడ్డిని ప్రశ్నించారు. ఈ సందర్బంగా రాజశేఖర్ రెడ్డి స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేశారు.
సీఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చి రాజశేఖర్‌రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఈ క్రమంలో హత్యా స్థలంలో దొరికిన లేఖపై ప్రశ్నలు అడిగారు సీబీఐ అధికారులు. వివేకా లేఖను ఎందుకు దాచిపెట్టమని చెపాల్సి వచ్చిందని సీబీఐ ప్రశ్నించింది. కాగా, వివేకా హత్యలో కుటుంబ కలహాలే కారణమని కొంత కాలంగా ఆరోపణలున్నాయి. తనను వివేకా రెండో వివాహం చేసుకోవడంతో కూతురు సునీతా రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని షమీమ్ తెలిపారు. ఇప్పటికే రాజశేఖర్ రెడ్డి, ఆయన సోదరుడు శివప్రకాష్‌రెడ్డిపై షమీమ్ పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పలుమార్లు నన్ను బెదిరించారంటూ సీబీఐ ఎదుట షమీష్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: సీబీఐ స్టేట్‌మెంట్‌లో వివేకా రెండో భార్య షమీమ్ సంచలన విషయాలు
Comments
Please login to add a commentAdd a comment