పుష్ప 2లో నటవిశ్వరూపం చూపించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌కు పూనకాలు తెప్పించింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా చూశాక అల్లు అర్జున్‌కు పెద్ద అభిమాని అయిపోయానంటోంది బాలీవుడ్ ప్రముఖ నటుడు గోవింద భార్య సునీత అహూజ.
థియేటర్స్‌కు వెళ్లను, కానీ..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సునీత మాట్లాడుతూ.. నేను పెద్దగా థియేటర్స్‌కు వెళ్లను. కానీ పుష్ప 2 సినిమా (Pushpa: The Rule) ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తానని నా కుమారుడితో అన్నాను. అదే చేశాను కూడా! హైదరాబాద్‌కు వెళ్లినప్పుడు కచ్చితంగా అల్లు అర్జున్‌ను కలుస్తాను. అతడు పడ్డ కష్టం సినిమాలో కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. సిక్స్ ప్యాక్ ఉందా? లేదా హ్యాండ్‌సమ్ లుక్స్‌తో ఉన్నాడా? అనేది ఇక్కడ విషయం కాదు.
నా కుమారుడికీ అదే చెప్తా
తన పనితనం తెలుస్తోంది. అతడిలా కష్టపడాలని నా కొడుక్కి కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటాను అని పేర్కొంది. పుష్ప 2 సినిమా విషయానికి వస్తే ఇది 2021లో వచ్చిన పుష్ప: ద రైజ్ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కింది. అనసూయ భరద్వాజ్, సునీల్, జగపతిబాబు, ఫహద్ ఫాజిల్ ముఖ్య పాత్రలు పోషించారు.
చదవండి: ప్రభాస్ 'కల్కి' సినిమా.. అనంత శ్రీరామ్ సంచలన కామెంట్స్!
Comments
Please login to add a commentAdd a comment