
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా తెలుగు సినీ పరిశ్రమ మరో నటుడిని కోల్పోయింది. ప్రముఖ నటుడు నటుడు కోసూరి వేణుగోపాల్ కరోనాతో కన్నుమూశారు. గత నెలలో ఈ వైరస్ బారినపడిన ఆయన హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్ర గుండెపోటు రావడంతో బుధవారం రాత్రి ఆయన తుది శ్వాస తీసుకున్నారు. దీంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. (నటుడు జయప్రకాశ్‌రెడ్డి కన్నుమూత)
వేణుగోపాల్ ఆకస్మిక మరణంపై పలువురు టాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జన్మించిన వేణుగోపాల్ ఎఫ్‌సీఐలో మేనేజర్‌గా పనిచేస్తూ రిటైర్ అయ్యారు. ఆ తరువాత నటనపై ఆసక్తితో సినీరంగం వైపు వచ్చారు. మర్యాద రామన్న, పిల్ల జమిందారు, ఛలో, అమీతుమీ చిత్రాల్లో విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు
Comments
Please login to add a commentAdd a comment