సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి మరో టాలెంటెడ్ రచయితని బలి తీసుకుంది. గాన గంధర్వుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం అకాలమరణం ఇండస్ట్రీలో తీరని విషాదాన్ని నింపింది. తాజాగా టాలీవుడ్ యువ కథా రచయిత వంశీ రాజేష్ కరోనాతో కన్నుమూశారు. గత కొంతకాలంగా కరోనాకు చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో గురువారం తుది శ్వాస తీసుకున్నారు. వంశీ రాజేష్ ఆకస్మిక మరణంతో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం ప్రకటించారు. (‘అన్నయ్య త్వరగా కోలుకోవాలని స్వామిని గట్టిగా వేడుకున్న’)
శ్రీను వైట్ల దర్శకత్వంలో, రవితేజ నటించిన 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమాకు రచయితగా ఆయన పనిచేసారు. టాలీవుడ్‌లో చాలా మంది ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇటీవల కరోనావైరస్‌తో పోరాడిన హీరో రాజశేఖర్ కోలుకుని ఇంటికి చేరారు. ఇంతలోనే మెగాస్టార్ చిరంజీవి తనకు కోవిడ్-19 పాజిటివ్ నిర్దారణ అయిందని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Writer #VamsiRajesh died due to Covid-19. He was previously associated with director #SrinuVitla and provided the story for #Raviteja's #AmarAkbarAnthony. A great talent gone too soon..!!!
#RIP pic.twitter.com/0xBzXZbrEh
— Sreedhar Sri (@SreedharSri4u) November 12, 2020
Comments
Please login to add a commentAdd a comment