
కమెడియన్ వేణు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బలగం చిత్రంతో దర్శకుడిగా మారిన వేణు ప్రముఖ కామెడీ షో జబర్దస్త్‌తో పాపులర్ అయ్యాడు. అంతకు ముందే సినిమాల్లో కమెడియన్‌గా నటించిన వేణుకు జబర్దస్త్ మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. వేణు వండర్స్ అనే పేరుతో టీంకు లీడర్‌గా వ్యవహరించిన నవ్వులు పండించాడు. ఇప్పుడున్న గెటప్ శ్రీను, సుడిగాలి సుదీర్ ఆయన టీంలోనే ఎదిగారు. ఈ కామెడీ షోలో ఎన్నో హిట్ టాస్క్ చేసి బుల్లితెర ప్రేక్షకులను కడుబ్బా నవ్వించిన వేణు జబర్దస్త్‌లో ఎక్కువ కాలం ఉండలేకపోయాడు.
చదవండి: Naresh-Pavithra Marriage: పెళ్లి చేసుకున్న నరేశ్-పవిత్ర?
కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వేణు ఈ షో నుంచి బయటకు వచ్చాడు. అయితే విభేదాల కారణంగానే వేణు ఈ షో నుంచి బయటకు వచ్చినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటి వరకు దీనిపై క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో తాను జబర్దస్త్ నుంచి బయటకు రావడంపై తాజాగా వేణు స్పందించాడు. ఆయన దర్శకత్వం వహించిన ‘బలగం’ మూవీ మంచి విజయం సాధించిన సందర్భంగా వేణు వరుస ఇంటర్య్వూల్లో పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు జబర్దస్త్ వీడటంపై ప్రశ్న ఎదురైంది. దీనికి అతడు స్పందిస్తూ.. ‘విబేధాల కారణంగా నేను జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాను అనడంలో వాస్తవం లేదు.
చదవండి: ఆ ఘనత విజయకాంత్‌దే: హీరో విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
కేవలం సినిమాపై ఇష్టంతోనే ఆ షో వదిలేశాను. మొదటి నుండి నా లక్ష్యం సినిమానే. ఫుల్ టైం సినిమాల్లో రాణించాలనే కోరికతోనే జబర్దస్త్ వీడాను. నేను ఉన్నప్పుడు రేటింగ్ బాగుంది. మంచి రెమ్యూనరేషన్ వస్తుంది. అయినప్పటికీ సినిమా కోసం వదులుకొని బయటకు వచ్చాను’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా అప్పట్లో వేణు చేసిన ఓ స్కిట్ వివాదంలో నిలిచన సంగతి తెలిసిందే. ఓ వర్గం వారు వేణుపై దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. బలగం చిత్రంతో తొలిసారి మెగాఫోన్ పట్టిన వేణు మొదటి ప్రయత్నంలోనే విజయం అందుకున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన ఈ చిత్రం అందరి ఊహాలను తలకిందులు చేస్తూ మంచి విజయం సాధించింది.