అర్జున్, శ్యామ్‌లతో ద్విభాషా చిత్రం | Arjun, Shyam Bilingual film | Sakshi
Sakshi News home page

అర్జున్, శ్యామ్‌లతో ద్విభాషా చిత్రం

Published Sun, Feb 1 2015 1:36 AM | Last Updated on Fri, Aug 17 2018 2:24 PM

అర్జున్, శ్యామ్‌లతో ద్విభాషా చిత్రం - Sakshi

అర్జున్, శ్యామ్‌లతో ద్విభాషా చిత్రం

యాక్షన్‌కింగ్ అర్జున్, యువ నటుడు శ్యామ్‌లు కలిసి తమిళం, కన్నడం భాషల్లో రూపొందనున్న ఓ భారీ చిత్రంలో నటించనున్నారు. ఇంతకుముందు కుప్పి, కావలన్‌కుడి యిరుప్పు, వనయుద్ధం వంటి వైవిధ్యభరిత చిత్రాలను తెరకెక్కించిన ఏఎంఆర్ రమేష్ దర్శకత్వం వహించనున్న చిత్రం ఇది. ఆ చిత్ర వివరాలను ఆయన వివరించారు. తానెప్పుడూ యదార్థ సంఘటనల కథా చిత్రాలనే రూపొందిస్తానన్నారు. గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రం సమాజంలో జరిగిన సంఘటనలతోనే ఉంటుందన్నారు. ది ఒక వ్యక్తి గురించిన కథ కాదని అన్నారు. చిత్ర కథనం ఊహాతీతంగా ఉంటుందని తెలిపారు. అర్జున్, శ్యామ్, తమిళంతో పాటు కన్నడంలోనూ ప్రాచుర్యం పొందినవారు కావడంతో ఈ చిత్రాన్ని తమిళం, కన్నడం భాషల్లో రూపొందించనున్నట్లు వివరించారు. కథానాయకి ఎంపిక జరుగుతుందన్నారు. ఈ చిత్రానికి కన్నడంలో గేమ్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్టు తమిళంలో ఇంకా పేరు నిర్ణయం కాలేదని దర్శకుడు ఏఎంఆర్ రమేష్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement