
ఆత్మీయ
‘కిక్’ శ్యామ్, ఆత్మీయ జంటగా సారథి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం ‘వాడొస్తాడు’. కె.వి. శబరీశ్ నిర్మాత. ఈ చిత్రం అమెరికాలోని లాస్ వేగాస్‌లో షూటింగ్ జరుపుకుంది. కేవీ శబరీశ్ మాట్లాడుతూ – ‘‘ప్రపంచ దేశాలలో అత్యధికంగా తుపాకులు కలిగి వున్న దేశం అమెరికా. ఆ దేశంలో జరిగే తుపాకీ కాల్పులలో అధికంగా బలవుతున్నది భారతీయులేనని ఇటీవల గణాంకాలు చెబుతున్నాయి. ఆ అంశం ఆధారంగా ఈ చిత్రం రూపొందించాం. పలువురు హాలీవుడ్ నిపుణులు, తమిళ సాంకేతిక నిపుణులతో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment