vadosthadu
-
అమెరికా కాల్పులతో...
‘కిక్’ శ్యామ్, ఆత్మీయ జంటగా సారథి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం ‘వాడొస్తాడు’. కె.వి. శబరీశ్ నిర్మాత. ఈ చిత్రం అమెరికాలోని లాస్ వేగాస్‌లో షూటింగ్ జరుపుకుంది. కేవీ శబరీశ్ మాట్లాడుతూ – ‘‘ప్రపంచ దేశాలలో అత్యధికంగా తుపాకులు కలిగి వున్న దేశం అమెరికా. ఆ దేశంలో జరిగే తుపాకీ కాల్పులలో అధికంగా బలవుతున్నది భారతీయులేనని ఇటీవల గణాంకాలు చెబుతున్నాయి. ఆ అంశం ఆధారంగా ఈ చిత్రం రూపొందించాం. పలువురు హాలీవుడ్ నిపుణులు, తమిళ సాంకేతిక నిపుణులతో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. -
'వాడొస్తాడు' సినిమాకు ఫైనాన్స్ చేసి..
హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా తాను ఫైనాన్స్ చేసిన సినిమాను తనకు తెలియకుండా విడుదల చేయడమే కాకుండా శాటిలైట్ హక్కులను విక్రయించారంటూ ఓ సినీ ఫైనాన్షియర్ చేసిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఇద్దరిని గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లికి చెందిన ఈశ్వర వరప్రసాద్ 2012లో "వాడొస్తాడు" అనే సినిమాకు రూ. 40 లక్షలు ఫైనాన్స్ చేశాడు. ఇందుకుగాను ఒప్పందం కూడా జరిగింది. అయితే తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండానే ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇండియన్ ఫిల్మ్స్ అధినేత పి. శ్రీనివాస్ చౌదరి ఆ సినిమాను విడుదల చేయడమే కాకుండా సన్‌నెట్‌వర్క్‌కు శాటిలైట్ హక్కులు కూడా అమ్ముకున్నాడు. ఒప్పందం ఉల్లంఘనలో జెమినీ ల్యాబ్స్ మేనేజర్ వేణుగోపాల్ హస్తం కూడా ఉండటంతో ఆ ఇద్దరిపైనా బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు శ్రీనివాస్‌చౌదరి, వేణుగోపాల్‌పై ఐపీసీ సెక్షన్ 406, 420 కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. (జూబ్లీహిల్స్)