Hero Nikhil Father Passed Away: యంగ్ హీరో నిఖిల్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి కావలి శ్యామ్ సిద్ధార్థ్ గురువారం(ఏప్రిల్ 28) ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు అరోగ్యం విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. తండ్రి అకాల మరణంతో నిఖిల్ ఇంట విషాదచాయలు అలుముకున్నాయి.
చదవండి: ‘ఆచార్య’లో సత్యదేవ్ అతిథి పాత్ర, గర్వంగా ఉందన్న చిరు
నిఖిల్ తండ్రి మరణవార్త తెలిసి టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు. నిఖిల్‌ను పరామర్శిస్తూ.. సోషల్ మీడియా వేదికగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం నిఖిల్ కార్తికేయ 2, 18 పేజెస్ చిత్రాల్లో నటిస్తున్నాడు. అలాగే 'స్పై' టైటిట్‌తో ఇటీవల ఓ పాన్ ఇండియా సినిమాను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. వరుస ప్రాజెక్ట్స్‌తో ఇప్పుడిప్పుడే కెరీర్ పరంగా సక్సెస్ సాధిస్తూ ముందుకు వెళుతున్న నిఖిల్‌కు పితృవియోగం కలగడం అందరిని కలిచివేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment