
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ ప్రధాన కార్యదర్శి శ్యాం కలకడ కన్నుమూశారు. మహమ్మారి కరోనా బారిన పడి ఆయన మరణించారు. కాగా శ్యాం కలకడ మరణం పట్ల వైఎస్సార్‌సీపీ విచారం వ్యక్తం చేసింది. ట్విటర్ వేదికగా నివాళి అర్పించింది. "వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి తన చివరి శ్వాస వరకు పార్టీ కోసం అనుక్షణం పనిచేసిన క్రియాశీలక కార్యకర్త శ్యామ్ కలకడ. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాధించాలని కోరుకుంటూ వైయస్ఆర్ సీపీ ఘన నివాళి అర్పిస్తోంది" అని ట్వీట్ చేసింది.
అదే విధంగా శ్యాం కలకడ ఆకస్మిక మృతి పట్ల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంతాపం ప్రకటించారు. "వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేసిన శ్యామ్ కలకడ మరణం నాకు తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన కలిగించింది. శ్యామ్ మరణం పార్టీకి తీరని లోటు" అని శ్యాం కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి తన చివరి శ్వాస వరకు పార్టీ కోసం అనుక్షణం పనిచేసిన క్రియాశీలక కార్యకర్త శ్యామ్ కలకడ. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాధించాలని కోరుకుంటూ వైయస్ఆర్ సీపీ ఘన నివాళి అర్పిస్తోంది. pic.twitter.com/3mY7rhzyXN
— YSR Congress Party (@YSRCParty) May 12, 2021