
సాక్షి, విశాఖపట్నం: తాను కోవిడ్ బారిన పడినట్లు వస్తున్న వదంతులను నమ్మవద్దని ప్రజలను వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి శనివారం కోరారు. శుక్రవారం తాను చేయించుకున్న కోవిడ్ టెస్ట్(ఆర్టీపీసీఆర్)లో భగవంతుని ఆశీర్వాదంతో నెగిటివ్ వచ్చిందని ఆయన ‘సాక్షి’తో చెప్పారు. తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని కొంతమంది మిత్రులు, శ్రేయాభిలాషులు, అభిమానులు ఫోన్‌కాల్స్ చేస్తున్నారని, అయితే భగవంతుడి దయవల్ల తాను ఆరోగ్యంగా ఉన్నానని ఆయన చెప్పారు.
చదవండి: