కోల్‌కతా: ఎస్–ఈ–ల్ టై గర్ టీఎంటీ రీ–బార్‌లను ఉత్పత్తి చేసే శ్యామ్ మెటా లిక్స్ అండ్ ఎనర్జీ కొత్తగా బ్యాటరీ–గ్రేడ్ అల్యుమినియం ఫాయిల్స్ తయారీలోకి ప్రవేశించింది. ఈ ఫాయిల్స్‌ను లిథియం అయాన్ సెల్స్ తయారీలో ఉపయోగిస్తారు.
దీనితో అంతర్జాతీయంగా లిథియం అయాన్ సెల్ మార్కె ట్లో ముడివస్తువులకు సంబంధించి భారత్ గణనీయమైన వాటాను దక్కించుకోవడంలో శ్యామ్ మెటాలిక్స్ తోడ్పాటు అందించగలదని సంస్థ పేర్కొంది. 1 గిగావాట్‌అవర్ ఎల్‌ఎఫ్‌పీ (లిథియం ఐరన్ ఫాస్ఫేట్) సెల్స్ తయారీ కోసం 350 టన్నుల అత్యంత శుద్ధి చేసిన అల్యూమినియం ఫాయిల్ అవసరమవుతుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment