Aluminum foil
-
బ్యాటరీ అల్యుమినియం ఫాయిల్స్ తయారీలోకి శ్యామ్ మెటాలిక్స్
కోల్‌కతా: ఎస్–ఈ–ల్ టై గర్ టీఎంటీ రీ–బార్లను ఉత్పత్తి చేసే శ్యామ్ మెటా లిక్స్ అండ్ ఎనర్జీ కొత్తగా బ్యాటరీ–గ్రేడ్ అల్యుమినియం ఫాయిల్స్ తయారీలోకి ప్రవేశించింది. ఈ ఫాయిల్స్‌ను లిథియం అయాన్ సెల్స్ తయారీలో ఉపయోగిస్తారు. దీనితో అంతర్జాతీయంగా లిథియం అయాన్ సెల్ మార్కె ట్లో ముడివస్తువులకు సంబంధించి భారత్ గణనీయమైన వాటాను దక్కించుకోవడంలో శ్యామ్ మెటాలిక్స్ తోడ్పాటు అందించగలదని సంస్థ పేర్కొంది. 1 గిగావాట్‌అవర్ ఎల్ఎఫ్పీ (లిథియం ఐరన్ ఫాస్ఫేట్) సెల్స్ తయారీ కోసం 350 టన్నుల అత్యంత శుద్ధి చేసిన అల్యూమినియం ఫాయిల్ అవసరమవుతుందని తెలిపింది. -
ఇంటిప్స్
వెండి వస్తువులు కొత్తవిలా మెరవాలంటే... లీటర్ నీటిలో బేకింగ్ సోడా కలిపి బాగా మరిగించాలి. మరొకపాత్ర అడుగున అల్యూమినియమ్ ఫాయిల్ (మార్కెట్లో దొరుకుతుంది) వేసి, పైన వేడి నీరు పోయాలి. అందులో వెండి వస్తువులను నెమ్మదిగా వేయాలి. కాసేపు అలాగే ఉంచి, బయటకు తీయాలి. మురికి అంతా పోతుంది. మరిగించిన నీటిలో ఉప్పు, బేకింగ్ సొడా వేసి కలపాలి. అలాగే దీంట్లో కొద్దిగా వెనిగర్‌ను కలపకుండా నెమ్మదిగా పోయాలి. ఆ తర్వాత వెండి ఆభరణాలు ఆ నీటిలో మెల్లగా వేయాలి. కాసేపు ఉంచి, వాటిని బయటకు తీసి, మెత్తని క్లాత్‌తో తుడవాలి. వెండి ఆభరణాలకు ఉన్న స్టోన్స్‌కి టొమాటో కెచప్‌ను అద్దుతూ, రుద్దితే అవి త్వరగా పాడవవు.