ఇంటిప్స్
వెండి వస్తువులు కొత్తవిలా మెరవాలంటే...
లీటర్ నీటిలో బేకింగ్ సోడా కలిపి బాగా మరిగించాలి. మరొకపాత్ర అడుగున అల్యూమినియమ్ ఫాయిల్ (మార్కెట్లో దొరుకుతుంది) వేసి, పైన వేడి నీరు పోయాలి. అందులో వెండి వస్తువులను నెమ్మదిగా వేయాలి. కాసేపు అలాగే ఉంచి, బయటకు తీయాలి. మురికి అంతా పోతుంది.
మరిగించిన నీటిలో ఉప్పు, బేకింగ్ సొడా వేసి కలపాలి. అలాగే దీంట్లో కొద్దిగా వెనిగర్‌ను కలపకుండా నెమ్మదిగా పోయాలి. ఆ తర్వాత వెండి ఆభరణాలు ఆ నీటిలో మెల్లగా వేయాలి. కాసేపు ఉంచి, వాటిని బయటకు తీసి, మెత్తని క్లాత్‌తో తుడవాలి. వెండి ఆభరణాలకు ఉన్న స్టోన్స్‌కి టొమాటో కెచప్‌ను అద్దుతూ, రుద్దితే అవి త్వరగా పాడవవు.