జీఎస్‌పీసీ వాటాలు కొన్న ఓఎన్‌జీసీ | ONGC which bought shares of GSPC | Sakshi
Sakshi News home page

జీఎస్‌పీసీ వాటాలు కొన్న ఓఎన్‌జీసీ

Published Sat, Aug 5 2017 1:02 AM | Last Updated on Mon, Sep 11 2017 11:16 PM

ONGC which bought shares of GSPC

న్యూఢిల్లీ: కృష్ణా గోదావరి (కేజీ)లో గుజరాత్‌ రాష్ట్ర పెట్రోలియం కార్పొరేషన్‌కు (జీఎస్‌పీసీ) ఉన్న 80% వాటాలను ఓఎన్‌ జీసీ కొనుగోలు చేసింది. ఇందుకు రూ.7,738 కోట్లు చెల్లించింది. ఇందుకు సంబంధించి ఈ ఏడాది మార్చిలోనే ఈ రెండు సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి.

దీనికి గత నెలలో కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. దీంతో కొనుగోలును పూర్తి చేసినట్టు ఓ ఎన్‌జీసీ తాజాగా ప్రకటించింది. డీడీడబ్ల్యూలో మిగిలిన 20 శాతం వాటాలో 10% జియో గ్లోబల్‌ రీసోర్సెస్‌కు, 10 శాతం జులిలెంట్‌ ఆఫ్‌షోర్‌ డ్రిల్లింగ్‌ లిమిటెడ్‌కు ఉన్నాయి. ఇందులో జియో గ్లోబల్‌ 10 % వాటాను జీఎస్‌పీసీ కొనుగోలు చేయనుంది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement