OPEC deal
-
భారత్‌కు ముడి చమురు ఎగుమతి చేసేందుకు ఇరాన్ సిద్ధం!..నేరుగానే డీల్
Rupee-rial trade mechanism: ఇరాన్ భారతదేశానికి రెండవ అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉండేది. అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి వైదొలగడంతో దాని చమురు ఎగుమతులపై మళ్లీ ఆంక్షలు విధించడంతో న్యూ ఢిల్లీ టెహ్రాన్ నుంచి దిగుమతులను నిలిపివేయవలసి వచ్చింది. ఒపెక్ సభ్యునికి వ్యతిరేకంగా ఆంక్షల ఎత్తివేతపై ప్రపంచ దేశలు, టెహ్రాన్ మధ్య చర్చలు కొనసాగుతున్నందున భారత్‌కి ముడి చమురు అవసరాలను తీర్చడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని భారత్‌లోని ఇరాన్ రాయబారి డాక్టర్ అలీ చెగేని పేర్కొన్నారు. అంతేకాదు రూపాయి-రియాల్ ట్రేడ్ మెకానిజంతో రెండు దేశాల కంపెనీలకు ఒకరితో ఒకరు నేరుగా డీల్ నిర్వహించు కోగలుగుతారని అలీ చెగేని అన్నారు. దీని వల్ల మధ్యవర్తిత్వ వ్యయాలను తగ్గుతాయి అని కూడా చెప్పారు. ఇరాన్‌కి ప్రపంచంలోని మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారు, వినియోగదారు అయిన భారత్ ముడి చమురు అవసరాలలో 80% దిగుమతులతో కవర్ చేస్తుంది. భారతీయ రిఫైనర్లు ఇరాన్ చమురును స్థానిక బ్యాంకుకు రూపాయిలలో చెల్లిస్తున్న వ్యాపారాన్ని పరిష్కరించేందుకు భారత్, ఇరాన్ ఒక బార్టర్ లాంటి యంత్రాంగాన్ని రూపొందించాయి ఆ నిధులను టెహ్రాన్ భారతదేశం నుంచి దిగుమతులకు చెల్లించడానికి ఉపయోగించింది. ఆంక్షల కారణంగా భారత్-ఇరాన్ వాణిజ్యం మార్చి 2019 ఆర్థిక సంవత్సరంలోని తొలి తొమ్మది నెలలు నుంచి దాదాపు రూ. 1700 కోట్లు వాణిజ్యం ఈ ఏడాది మొదటి 10 నెలల ఏప్రిల్ నుంచి జనవరిలో 200 కోట్ల కంటే తక్కువగా పడిపోయింది. పైగా రెండు దేశాలు రూపాయి-రియాల్ వాణిజ్య విధానాలను ప్రారంభిస్తే, ద్వైపాక్షిక వాణిజ్యం 30 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని చెగేని అన్నారు. (చదవండి: ఈ యుద్ధం జెలెన్ స్కీని హీరోని చేసింది...అందరి నోట అతని పేరే!) -
వరుసగా ఏడో రోజు.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుతుండటంతో నేరుగా ఆ భారం వినియోగదారుడిపై మోపుతున్నాయి దేశీ చమురు సంస్థలు. లీటరు డీజిల్‌పై 30 పైసలు, లీటరు పెట్రోలు 37 పైసల వంతున ఛార్జీలు పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా ఏడు రోజులు పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 108.60 లీటరు డీజిల్ ధర రూ.101.62లకు చేరుకుంది. చేతులెత్తేసిన చమురు సంస్థలు చమురు ఉత్పత్తిపై ఒపెక్ దేశాలు తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి దేశ ప్రజలపై పెట్రోలు భారం పడకుండా చర్యలు తీసుకోవడంలో చమురు సంస్థలు విఫలమవుతున్నాయి. మరోవైపు కేంద్రం సైతం చమురు సంస్థలు ఎడాపెడా ఛార్జీలు పెంచుతుంటే ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి తప్పితే, ధరాఘాతం నుంచి సామాన్యలను రక్షించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. నవంబర్ వరకు నవంబర్ వరకు ముడి చమురు ధరలు పెరుగాయని ఒపెక్ దేశాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఇటు కేంద్రం, అటు చమురు సంస్థలు ఈలోగా ఏమైనా ఉపశమనం చర్యలు తీసుకోకుంటే చమురు ధరలు భరించలేని స్థాయికి చేరుకునే ప్రమాదం ఉంది. -
స్థిరంగా కొనసాగుతున్న పెట్రో ధరలు, 14 రోజులుగా
దేశీయ మార్కెట్లో చమురు ధరలు 14రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. గత రెండు వారాల క్రితం పెరిగిన చమరు ధరలు ఆ తర్వాత నుంచి ఎలాంటి మార్పుచోటు చేసుకోలేదు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.05 శాతం పెరుగుదలతో 75.14 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.14 శాతం పెరుగుదలతో 73.72 డాలర్లకు చేరింది. శనివారం రోజు పెట్రోల్ ధరల వివరాలు ముంబై లీటర్ పెట్రోల్ ధర రూ .107.83 ఉండగా డీజిల్ ధర రూ .97.45గా ఉంది ఢిల్లీలో పెట్రోల్ ధర రూ .101.84 ఉండగా డీజిల్ ధర రూ .89.87గా ఉంది చెన్నైలో పెట్రోల్ ధర రూ102.49 ఉండగా డీజిల్ రూ .94.39 గా ఉంది కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ .102.08 ఉండగా డీజిల్ రూ .93.02 గా ఉంది హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ .105. 83 ఉండగా డీజిల్ రూ .97.96గా ఉంది బెంగళూరు లో పెట్రోల్ ధర రూ .105.25 ఉండగా డీజిల్ రూ .95.26గా ఉంది -
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఎఫెక్ట్: చమురు ధరలు తగ్గనున్నాయా?!
సాక్షి,న్యూఢిల్లీ : దేశంలో చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మే 3 నుంచి నేటి మధ్య కాలంలో వరుసగా 4 రోజుల పాటు పెట్రో ధరలు పెరగకపోవడం గమనార్హం. అయితే అందుకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగడం ఓ కారణమేనని మార్కెట్ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రోజు పెట్రోల్ ధరల వివరాలు ముంబై లీటర్ పెట్రోల్ ధర రూ .107.83 ఉండగా డీజిల్ ధర రూ .97.45గా ఉంది ఢిల్లీలో పెట్రోల్ ధర రూ .101.84 ఉండగా డీజిల్ ధర రూ .89.87గా ఉంది చెన్నైలో పెట్రోల్ ధర రూ102.49 ఉండగా డీజిల్ రూ .94.39 గా ఉంది కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ .102.08 ఉండగా డీజిల్ రూ .93.02 గా ఉంది హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ .105. 83 ఉండగా డీజిల్ రూ .97.96గా ఉంది బెంగళూరు లో పెట్రోల్ ధర రూ .105.25 ఉండగా డీజిల్ రూ .95.26గా ఉంది మరో వైపు త్వరలో చమురు ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూలై 18 న జరిగిన ఒపెక్ (పెట్రోలియం ఉత్పత్తి చేసే దేశాల సమాఖ్య) సమావేశంలో పెట్రోలు ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించారు.కరోనా ఎఫెక్ట్‌తో తగ్గించిన పెట్రోలు నెల వారి ఉత్పత్తి సామార్థ్యాన్ని తిరిగి రోజుకు 400,000 బారెల్స్ పెంచాలని ఒపెక్ దేశాలు నిర్ణయించాయి. ఈ ప్రకటన తర్వాత ముడి ధరలు బాగా పడిపోయాయి. జులై 16న బ్యారెల్ ధర 73.59 డాలర్లు ఉండగా... జులై 19న ధర 68.62డాలర్లుగా ఉంది. ముడి చమురు ఉత్పత్తి పెరుగుతూ పోతే దేశీయంగా ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్లు... ఈ విషయాలపై కన్నేయండి
ముంబై: కార్పొరేట్ ఫలితాలు, దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త రకం కరోనా వేరియంట్లు, రుతుపవనాల కదలికలు కూడా కీలకంగా మారొచ్చని భావిస్తున్నారు. వీటితో పాటు ప్రపంచ మార్కెట్ల పోకడ, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, డాలర్‌తో రూపాయి మారకం, ముడిచమురు కదలికల అంశాలు సైతం ట్రేడింగ్ ప్రభావితం చేయగలవని విశ్లేషిస్తున్నారు. గత వారంలో సెన్సెక్స్ 98 పాయింట్లు, నిఫ్టీ 32 పాయింట్లు నష్టపోయాయి. ఐటీ, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లలో లాభాల స్వీకరణ జరగడం ఇందుకు కారణమైంది. ‘‘స్టాక్ మార్కెట్లో స్థిరీకరణ కొనసాగవచ్చు. జూన్ క్వార్టర్ ఫలితాల ప్రకటన నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. పతనమైన ప్రతిసారి కొనుగోలు తరహా విధానం నడుస్తోంది. కావున కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్లు మద్దతు లభిస్తోంది. సాంకేతికంగా నిఫ్టీ 15,600 వద్ద తక్షణ మద్దతు స్థాయిని కలిగి ఉంది. ఎగువస్థాయిలో 15,800 వద్ద కీలకమైన నిరోధాన్ని కలిగి ఉంది’’ రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ బినోద్ మోదీ తెలిపారు. మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలను మరింత లోతుగా విశ్లేషిస్తే.. ఆర్థిక గణాంకాల విడుదలతో అప్రమత్తత కేంద్రం గణాంకాల శాఖ జులై 12న సోమవారం మే నెలకు సంబంధించిన పారిశ్రామికోత్పత్తి గణాంకాలను మార్కెట్ ముగిసిన తర్వాత వెల్లడించనుంది. ఇవాళే జూన్ నెలకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలను ప్రకటించనుంది. ఇక టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు జులై 14న (బుధవారం)వస్తాయి. జూన్ నెల వాణిజ్య లోటు గణాంకాలు గురువారం విడుదల అవుతాయి. ఆర్బీఐ జూన్ 2తో ముగిసిన వారపు డిపాజిట్లు, బ్యాంక్ రుణ వృద్ధి గణాంకాలను శుక్రవారం విడుదల చేయనుంది. అదే రోజున జూన్ 9వ తేదితో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటాను విడుదల చేయనుంది. కీలక స్థూల గణాంకాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. దీంతో స్టాక్ మార్కెట్ ఒకింత ఒడిదుడుకులకు లోనుకావచ్చని అంచనా. ఈ వారం త్రైమాసిక ఫలితాలు... ఐటీ దిగ్గజం టీసీఎస్ గత వారంలో క్యూ1 ఆర్థిక గణాంకాలను ప్రకటించి కార్పొరేట్ రంగంలో ఫలితాల సందడిని షురూ చేసింది. ఈ వారంలో ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, ఎల్అండ్టీతో సహా 75కు పైగా కంపెనీలు తమ తొలి త్రైమాసికపు ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. రెండో దశ కోవిడ్ కట్టడికి స్థానిక ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్లు, కర్ఫ్యూలతో కంపెనీల పనితీరు అంతంత మాత్రంగానే ఉండొచ్చు. అయితే ఫలితాల ప్రకటన సందర్భంగా యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. దొడ్ల డైయిరీ, హెచ్ఎఫ్సీఎల్, హెచ్ఎంటీ, డెక్కన్ హెల్త్ కేర్, టాటా మోటాలిక్స్, 5పైసా క్యాపిటల్, క్రాఫ్ట్‌మెన్ ఆటోమెషన్, ఎస్సార్ సెక్యూరిటీస్, హట్సన్ ఆగ్రో ప్రాడెక్ట్స్, ఏంజిల్ బ్రోకింగ్, ఆదిత్య బిర్లా మనీ, సియెంట్, మంగళం టింబర్ ప్రాడెక్ట్స్, టాటా ఎలక్సీ, టాటా స్టీల్, డెన్ నెట్వర్క్స్ తదితర కంపెనీలు ఇదే వారంలో క్యూ1 ఫలితాలను వెల్లడించనున్నాయి. డెల్టా వేరియంట్ ఆందోళనలు... పలు దేశాల్లో కొత్త రకం కరోనా డెల్టా వేరియంట్ వైరస్ విజృంభిస్తోంది. ఈ తాజా పరిణామం జాతీయ, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లను భయపెడుతోంది. వైరస్ శరవేగంగా విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆర్థిక వృద్ధి ఏ విధంగా ఉంటుందనే అంశంపై ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తున్నారు. మన దేశంలో గత మూడు రోజుల నుంచి కరోనా కేసులు అనూహ్యంగా పుంజుకుంటుండటంతో మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎఫ్ఐఐలు అమ్మేస్తున్నారు బెంచ్‌మార్క్ సూచీలు సరికొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేసిన తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) లాభా ల స్వీకరణకు మొగ్గుచూపారు. ఈ జూలై తొలి ఏడురోజుల్లో ఎఫ్ఐఐలు రూ.2,249 కోట్ల విలువైన షేర్లను అమ్మినట్లు ఎక్సే్చంజ్ గణాంకాలు తెలిపాయి. ‘‘ఇతర కరెన్సీ విలువల్లో యూఎస్ డాలర్ బలపడుతోంది. ఒపెక్ దేశాలు ఉత్పత్తికి ఆసక్తి చూపకపోవడంతో క్రూడాయిల్ ధరలు నిరంతరంగా పెరుగుతున్నాయి. తర్వలో వడ్డీరేట్లను పెంచుతామని యూఎస్ ఫెడ్ కమిటీ తెలిపింది. ఈ పరిణామాల దృష్ట్యా రానున్న రోజుల్లో భారత మార్కెట్లోకి విదేశీ పెట్టుబడులు రాక పరిమితంగా ఉండొచ్చు’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. -
ముడిచమురుకూ కోవిడ్-19 సెగ
సెకండ్ వేవ్‌లో భాగంగా అమెరికాసహా పలు యూరోపియన్ దేశాలను కోవిడ్-19 వణికిస్తుండటంతో ముడిచమురు ధరలు పతనమవుతున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ కట్టడికి బ్రిటన్ లాక్‌డవున్‌ను ప్రకటించగా.. ఫ్రాన్స్, జర్మనీ సైతం కఠిన ఆంక్షలను విధించాయి. దీంతో ఇటీవల కొంతమేర రికవరీ బాట పట్టినట్లు కనిపిస్తున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరోసారి కుదేలయ్యే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా ముడిచమురు ఫ్యూచర్స్‌లో ట్రేడర్లు భారీ అమ్మకాలకు తెరతీసినట్లు తెలియజేశారు. వెరసి బుధవారం 5 శాతం పతనమైన బ్రెంట్, నైమెక్స్ చమురు ధరలు గురువారం తిరిగి అదే స్థాయిలో డీలాపడ్డాయి. దీంతో ఒక దశలో నైమెక్స్ బ్యారల్ 5.3 శాతం పతనమై 35.11 డాలర్లకు చేరింది. ఇది నాలుగు నెలల కనిష్టంకాగా.. బ్రెంట్ బ్యారల్ సైతం 5 శాతం క్షీణించి 36.89 డాలర్లను తాకింది. బ్రెంట్ ధరలైతే ఈ ఏడాది మే నెలలో మాత్రమే 37 డాలర్ల దిగువకు చేరినట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి చమురు ధరలు మే, జూన్ స్థాయికి చేరాయి. ప్రస్తుతం ఓకే ప్రస్తుతం న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు బ్యారల్ 0.75 శాతం పుంజుకుని 36.43 డాలర్లకు చేరింది. ఈ బాటలో లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ సైతం 0.8 శాతం బలపడి 37.95 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. కారణాలివీ అక్టోబర్ 23తో ముగిసిన వారంలో ఇంధన నిల్వలు అంచనాలను మించుతూ 4.57 మిలియన్ బ్యారళ్లకు చేరినట్లు అమెరికన్ పెట్రోలియం ఇన్స్టిట్యూట్ పేర్కొంది. దీనికితోడు కోవిడ్-19 కారణంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు మాంద్యం కోరల్లో చిక్కుకోవడంతో ఇటీవల కొంతకాలంగా చమురుకు డిమాండ్ క్షీణిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. గత వారం అమెరికా, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ తదితర దేశాలలోనూ ఉన్నట్టుండి కోవిడ్-19 కేసులు పెరగడంతో సెంటిమెంటుకు షాక్ తగిలినట్లు విశ్లేషకులు తెలియజేశారు. కోతలు కొనసాగవచ్చు చమురు ధరలకు బలాన్నిచ్చే బాటలో ఇప్పటికే రష్యాసహా ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్న విషయంవిదితమే. కొంతకాలంగా ప్రపంచ చమురు ఉత్పత్తిలో రోజుకి 7.7 మిలియన్ బ్యారళ్లమేర కోతలను అమలు చేస్తున్నాయి. ఒప్పందం ప్రకారం ఉత్పత్తిలో కోతలు 2021 జనవరి వరకూ అమల్లో ఉంటాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే జనవరి తదుపరి కోతలను ఎత్తివేసే అవకాశంలేదని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఆర్థిక మందగమనం కారణంగా చమురుకు డిమాండ్ క్షీణిస్తున్నదని, దీంతో కోతలను మరికొంతకాలంపాటు కొనసాగేందుకు నిర్ణయించే వీలున్నదని అభిప్రాయపడ్డాయి. -
క్రూడ్ క్రాష్..
న్యూయార్క్/న్యూఢిల్లీ: ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా మహమ్మారి దెబ్బకు ముడిచమురు ధర పాతాళానికి పడిపోయింది. న్యూయార్క్ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో లైట్ స్వీట్ క్రూడ్(డబ్లూటీఐ) బేరల్ మే నెల కాంట్రాక్ట్ ధర సోమవారం ఒకానొక దశలో కుప్పకూలి... మైనస్ 28 డాలర్ల స్థాయికి పడిపోయింది. చరిత్రలో క్రూడ్ ధర ఈ స్థాయిలో పతనాన్ని చవిచూడడం ఇదే మొదటి సారి. కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తుండటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చమురుకు డిమాండ్ భారీగా తగ్గిపోయింది. ఉత్పత్తిదారుల వద్ద నిల్వలు గరిష్ట స్థాయిలకు చేరుకుంటున్నాయి. దీంతో తమ నిల్వలను తగ్గించుకునేందుకు ఉత్పత్తిదారులే కొనుగోలుదారులకు ఎదురు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడినట్టే. నిల్వలు భారీగా పేరుకుపోతున్న ధోరణి, కనుచూపుమేర కనిపించని ఆర్థిక రికవరీ నేపథ్యంలో మళ్లీ ముడిచమురు ధరలు ఎప్పుడు పుంజుకుంటాయోనని ఉత్పత్తిదారులు గగ్గోలు పెడుతున్నారు. భౌగోళిక ఉద్రిక్తతల నుంచి కరోనా, ప్రైస్‌వార్ వరకూ... నిజానికి 2020 తొలి నాలుగు నెలల్లోనే అంతర్జాతీయంగా క్రూడ్ ధర తీవ్ర హెచ్చుతగ్గులను చవిచూసింది. 2020 జనవరిలో అమెరికా దాడుల్లో ఇరాన్ మేజర్ జనరల్ ఖాసిం సులేమానీ మరణించడం, దీనితో భౌగోళిక ఉద్రిక్త పరిణామాలతో క్రూడ్ ధర ఒక్కసారిగా ఎగిసి 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది. అయితే ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు, తర్వాత కరోనా ప్రభావంతో రష్యా–సౌదీ అరేబియాల మధ్య చోటుచేసుకున్న ఈ ‘ధరల యుద్ధం’తో క్రూడ్ ధర పతనమవుతూ వచ్చింది. ఫలించని ఒపెక్ ఒప్పందాలు.. క్రూడ్ ధరలు మరింత పతనమై, తమ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలకుండా పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య ఒపెక్ పది రోజుల క్రితం అసాధారణ చర్యలు తీసుకుంది. ఈ మేరకు కుదిరిన ఒక డీల్ ప్రకారం జూలై దాకా ఒపెక్, దాని భాగస్వామ్య దేశాలు చమురు ఉత్పత్తిని రోజుకు 10 మిలియన్ బ్యారెళ్ల మేర (బీపీడీ) తగ్గించుకోవాలని నిర్ణయించాయి. అమెరికాతో పాటు మరిన్ని దేశాలు కూడా తమవంతుగా ఉత్పత్తి కోతలపై నిర్ణయాలు తీసుకోవడంపై దృష్టి పెట్టాయి. ఆయా పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా చమురు ఉత్పత్తిలో 15 శాతానికి కోతపడుతుందన్న అంచనాలు వెలువడ్డాయి. అయితే, డిమాండ్ పెంచేందుకు ఒపెక్, అమెరికాలు చేసిన ప్రయత్నమేదీ ఫలించలేదని కేవలం 10 రోజులకే స్పష్టమైపోయింది. ఇప్పటికే నిల్వలు భారీగా పేరుకుపోయిన పరిస్థితి నెలకొనడం ఇక్కడ ఒక కారణమైతే, ఉత్పత్తి కోతలపై ఆయా దేశాలు ఆలస్యంగా నిర్ణయాలు తీసుకున్నాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఒకవేళ ఉత్తర అమెరికన్ సంస్థలు 5 మిలియన్ బ్యారెళ్ల మేర ఉత్పత్తిని తగ్గించుకున్నా.. ఇంకా 5–10 మిలియన్ బీపీడీ మేర సరఫరా అధికంగానే ఉంటుందని విశ్లేషణ. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు స్టోరేజీ పూర్తి స్థాయిలో నిండుగా ఉందని అంచనా. 7.4 బిలియన్ బ్యారెళ్ల చమురు, తత్సంబంధ ఉత్పత్తుల నిల్వలు ఉన్నాయని.. ఇవి కాకుండా 1.3 బిలియన్ బ్యారెళ్లు రవాణాలో ఉన్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ప్రత్యేకించి అమెరికాలోని ఒక్లహోమాలో క్రూడ్ నిల్వల హబ్‌లో నిల్వల పరిస్థితి దాదాపు దాని పూర్తి సామర్థ్యానికి చేరుకుంటోందని వార్తలు వస్తున్నాయి. ఇక్కడ వర్కింగ్ స్టోరేజ్ సామర్థ్యం 76 మిలియన్ బేరళ్లయితే, 55 మిలియన్ బేరళ్లకు ఈ స్టోరేజ్‌కి చేరినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఇదే పరిస్థితి కొనసాగితే, కొనుగోలు చేసిన క్రూడ్ ఆయిల్‌ను తీసుకువెళ్లాలని తమ కస్టమర్లపై చమురు ఉత్పత్తిదారులు ఒత్తిడి తీసుకుని వచ్చే పరిస్థితి ఉంటుందన్నది విశ్లేషణ. అంతేకాదు అవసరమైతే కొనుగోలుదారులకు ఎదురు డబ్బులు ఇచ్చిమరీ నిల్వలు తగ్గించుకోవాల్సి రావచ్చని కూడా నిపుణులు పేర్కొంటున్నారు. ఎలియట్‌వేవ్ సిద్ధాంతం ప్రకారం వచ్చే దశాబ్దంలో ఎప్పడోకప్పుడు ముడిచమురు ధర 4–10 డాలర్ల స్థాయికి పడిపోవచ్చు. మళ్లీ ఆల్‌టైమ్ గరిష్టాన్ని (147.67 డాలర్లు) చూడాలంటే చాలా ఏళ్లే పడుతుంది. – 2009లో ఎలియట్‌వేవ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు రాబర్ట్ ప్రెషెర్ అంచనా 1999 జనవరిలో క్రూడ్ కనిష్ట స్థాయి: 11.72 డాలర్లు 2008 జూన్ క్రూడ్ ఆల్‌టైమ్ గరిష్టం: 147.67 డాలర్లు 2020 ఏప్రిల్ 20న క్రూడ్ కనిష్ట స్థాయి: మైనస్ 28 డాలర్లు -
ఇరాన్ చమురును భారత్ కొనుక్కోవచ్చు
వాషింగ్టన్: ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసేందుకు 8 దేశాలకు తాత్కాలికంగా అనుమతిచ్చినట్లు అమెరికా తెలిపింది. ఇరాన్ నుంచి ఇప్పటికే చమురు దిగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. ఇంకా కోత విధిస్తే మార్కెట్లో ఇంధన ధరలు పెరిగే ముప్పు ఉన్నందునే అమెరికా తన వైఖరిని సడలించినట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో లావాదేవీల వ్యవహారంలో ఆంక్షల నుంచి మినహాయింపు పొందిన 8 దేశాల జాబితాలో భారత్, జపాన్, దక్షిణ కొరియా ఉన్నట్లు అమెరికా ఉన్నతాధికారిని ఉటంకిస్తూ బ్లూమ్‌బర్గ్ మీడియా సంస్థ వెల్లడించింది. ఇరాన్‌పై తాజా ఆంక్షలు అమల్లోకి వచ్చే నవంబర్ 4 నాటికి ఆ దేశం నుంచి చమురు కొనుగోలును పూర్తిగా నిలిపేయాలని అమెరికా ఇది వరకే భారత్ సహా పలు దేశాల్ని కోరిన సంగతి తెలిసిందే. ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో చైనా తరవాత భారత్ రెండో స్థానంలో ఉంది. -
పుంజుకున్నచమురు ధరలు
లండన్: ఒపెక్ డీల్ కు పెట్టుబడిదారుల మద్దతు లభించినట్టు కనిపిస్తోంది. అల్జీరియా నాన్ ఒపెక్, ఒపెక్ దేశాల సమావేశం నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు బలపడుతున్నాయి. బ్రెంట్ చమురు బ్యారల్ ధర 50 డాలర్లను అధిగమించింది. ఆగస్ట్ తరువాత ఈ స్థాయికి చేరడం ఇదే ప్రథమం. విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా చమురు ధరలు ర్యాలీ అయ్యాయి. యూరోప్, ఆసియా మార్కెట్లు పెద్ద మార్కెట్లు గా ఉండగా, జర్మనీ, చైనా మార్కెట్లకు సోమవారం సెలవు. గత వారం అల్జీరియాలో జరిగిన రష్యా వంటి నాన్ ఒపెక్ దేశాలతో ఒపెక్ దేశాలు నిర్వహించిన సమావేశంలో ఉత్పత్తిలో కోత విధించేందుకు సౌదీ అరేబియా తదితర దేశాలు అంగీకరించాయి. గతరెండేళ్లుగా క్షీణిస్తున్న ధరలను ఊతం దిచ్చే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. రోజుకి 7.5 లక్షల బ్యారళ్ల మేర చమురు ఉత్పత్తిలో కోత పెట్టేందుకు సౌదీ అరేబియా తదితర దేశాలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో లండన్ మార్కెట్లో 1 శాతం పెరిగి 50.69 డాలర్ల వద్ద ఉండగా, న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు కూడా బ్యారల్ దాదాపు 1 శాతం ఎగసి 48.70 డాలర్లకు చేరింది.