'అవమానించినందుకు రూ.100 కోట్లు ఇవ్వండి' | US teen's family seeks USD 15 mn in clock incident By Seema Hakhu Kachru | Sakshi
Sakshi News home page

'అవమానించినందుకు రూ.100 కోట్లు ఇవ్వండి'

Published Tue, Nov 24 2015 9:10 AM | Last Updated on Fri, Aug 24 2018 4:15 PM

'అవమానించినందుకు రూ.100 కోట్లు ఇవ్వండి' - Sakshi

'అవమానించినందుకు రూ.100 కోట్లు ఇవ్వండి'

హ్యూస్టన్: తనను అరెస్టు చేసి అవమానించిన వారు దాదాపు రూ.వందకోట్లు (రూ.99,54,81,179.1)-(15 మిలియన్ డాలర్లు)) చెల్లించాలని, లిఖిత పూర్వక క్షమాపణలు చెప్పాలని ఎనిమిదో తరగతి చదువుతున్న అహ్మద్ మహ్మద్ డిమాండ్ చేశాడు. అమెరికాలోని టెక్సాస్ లోని ఓ పాఠశాలలో  ఎనిమిదో తరగతి చదువుతున్న ఈ బాలుడు సొంత తెలివి తేటలతో అలారం గడియారాన్ని తయారు చేసి స్కూల్ కి తీసుకురాగా దానిని బాంబు అనుకొని భ్రమపడి ఆ విద్యార్థిని అరెస్టు చేశారు. ఈ విషయం మీడియాకు తెలిసి ఆ విద్యార్థి ప్రపంచం మొత్తానికి పరిచయం అయ్యాడు.

ఏకంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ ఆ బాలుడి తెలివి తేటలకు ముగ్దులై అతడిని కలిసేందుకు ఆహ్వానించారు కూడా. వైట్ హౌస్ ఇప్పటికే అతడిని సత్కరించింది. అయితే, ఖతార్ లోని ఓ ముస్లిం ఫౌండేషన్ ఆ విద్యార్థిని చదివించేందుకు ముందుకు రావడంతో అతడు త్వరలో అక్కడికి వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో తనను అరెస్టు చేసిన ఇర్వింగ్ సిటీ పోలీసులు, మేయర్ క్షమాపణలు చెప్పాలని పది మిలియన్ డాలర్లు నష్ట పరిహారంగా చెల్లించాలని, అలాగే, తనను తప్పుగా అర్థం చేసుకొని ఓ ముస్లిం విద్యార్థిపట్ల వివక్ష చూపించారని ఆరోపిస్తూ ఐదు మిలియన్ డాలర్లు నష్టపరిహారంగా చెల్లించడంతో పాటు తనకు లిఖిత పూర్వక క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. ఈ మేరకు ఆ విద్యార్థి తరుపు న్యాయవాది సంబంధిత వ్యక్తులకు నోటీసులు పంపించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement