ఎనిమిదో తరగతిలోనే ఎంత అదృష్టం! | Ahmed Mohamed, arrested over homemade clock, will move to Qatar for studies | Sakshi
Sakshi News home page

ఎనిమిదో తరగతిలోనే ఎంత అదృష్టం!

Published Wed, Oct 21 2015 3:21 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

ఎనిమిదో తరగతిలోనే ఎంత అదృష్టం! - Sakshi

ఎనిమిదో తరగతిలోనే ఎంత అదృష్టం!

టెక్సాస్: అదృష్టం అంటే ఇదేనేమో. నిన్న మొన్నటి వరకు అతడో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ సాధారణ విద్యార్థి. కానీ అతడు చేసిన చిన్న ఆలోచన మొత్తం జీవితాన్నే మార్చేసింది. గొప్పగొప్పవారికి సైతం దక్కని అదృష్టం తరుముకుంటూ వెంటపడింది. ఏకంగా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో మీటింగులు, ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్వంటి మేథావులతో ఫోన్లో సంభాషణలు ఎవరికి ఉంటుందీ అదృష్టం. అది కాస్త మరింత పెరిగి ఇప్పుడు అతడి ఉన్నత విద్య కోసం ఏకంగా ప్రపంచంలోనే ధనిక గల్ఫ్ దేశమైన దుబాయ్లోని ఖతార్లో అడుగుపెడుతున్నాడు.

ప్రస్తుతం టెక్సాస్లో ఎనిమిదో తరగతి చదువుతున్న అతడి మిగితా విద్యాభ్యాసం ఖర్చంతా తమదే అంటూ ఖతార్లోని ఓ ముస్లిం సంస్థ ముందుకొచ్చింది. దీంతో అతడి కుటుంబమంతా కలిసి టెక్సాస్నుంచి ఖతార్కు బయలుదేరనున్నారు. అహ్మద్ మహ్మద్ అనే పద్నాలుగేళ్ల కుర్రాడు టెక్సాస్లోని ఓ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. అతడు ఈ ఏడాది ప్రారంభంలో సొంత తెలివితేటలతో ఓ అలారం గడియారాన్ని తయారు చేసిన విషయం తెలిసిందే. దానిని తన టీచర్లకు చూపించాలనే ఉద్దేశంతో పాఠశాలకు తీసుకురాగా అది బాంబు అనుకుని భ్రమపడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడికి బేడీలు వేశారు.

ఈ విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేసి ఆ బాల మేధావి తెలివి తేటలకు ఒబామా, జూకర్ బర్గ్ ముగ్దులై పోయారు. గత రెండు రోజుల కిందట ఒబామా స్వయంగా వైట్ హౌస్కు ఆహ్వానించి మర్యాదలు కూడా చేశారు. దీంతో దుబాయ్లోని ఓ ముస్లిం సంస్థ తమ కమ్యూనిటికి చెందిన విద్యార్థులను మరింత పురోగతిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఖతార్లో విద్యాభ్యాసం పూర్తి చేయించేందుకు ఆహ్వానించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement