
సత్య నాదెళ్ల జీతం తగ్గిందట..!
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల వేతన ప్యాకేజీ గతంతో పోల్చుకుంటే తగ్గింది. దాదాపు 3.3శాతం తగ్గి 18(17.7) మిలియన్ డాలర్లకు చేరింది. సోమవారం సంస్థ అందించిన ప్రిలిమినరీ ప్రాక్స్ స్టేట్ మెంట్ ఫైలింగ్ ప్రకారం రూ. 120 కోట్ల వేతనం సహా బోనస్ 12 మిలియన్ల డాలర్ స్టాక్ అవార్డు లభించనుంది. ఆయనకు చెల్లించిన ప్యాకేజీలో 5.66 మిలియన్ డాలర్ల వేతనం, బోనస్, 12 మిలియన్ డాలర్ల వాటాలు ఉన్నాయి. రెగ్యులేటరీ ఫైలింగ్‌లో సంస్థ ఈ విషయాలను పేర్కొంది. ఈ వాటాల్లో సగం 2018 నాటికి సత్య నాదెళ్లకు అందుతాయి. కంపెనీ లక్ష్యాలను పూర్తి స్థాయిలో చేరితే 2019లో మిగిలిన వాటాలు కూడా ఆయనకు అందుతాయని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
సత్యనాదెళ్లను సీఈవోగా నియమించుకునేటప్పుడు మైక్రోసాఫ్ట్ ఆయనకు 59 మిలియన్ డాలర్ల విలువైన వాటాలు ఇచ్చేందుకు అంగీకరించింది. అదే సమయంలో వీటిని మూడు విడతలుగా ఇవ్వనున్నారు. 2019, 2020, 2021లో చెల్లించనున్నారు. ఇవి ఇవ్వాలంటే ఎస్‌అండ్‌పీ 500లోని దాదాపు 60శాతం కంపెనీల వాటాదారుల ఆదాయాం కంటే మైక్రోసాఫ్ట్ వాటాదారుల ఆదాయం ఐదేళ్లపాటు ఎక్కువగా ఉండాలి. సత్యనాదెళ్ల పదవి చేపట్టినప్పటి నుంచి కంపెనీ ఆదాయం దాదాపు 70శాతం పెరిగినట్లు సమాచారం. ఈ 12నెలల కాలంలో మైక్రోసాఫ్ట్ షేర్లు 15శాతం పెరుగుదలను నమోదు చేయగా, అదే సమయంలో ఎస్‌అండ్‌పీ500 మాత్రం ఒక శాతం మాత్రమే పెరిగడం గమనార్హం.
కాగా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా గత జులైలోరాజీనామా చేసిన కెవిన్ ట్యూనర్ 2016 సం.రానికి గాను 13 బిలియన్ డాలర్ల వేతనంతో సెకండ్ హయ్యస్ట్ పెయిడ్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నారు. మరోవైపు మైక్రోసాఫ్ట్ ప్రతినిధి పీటీ వూటన్ ఈ ప్యాకేజీపై మాట్లాడేందుకు నిరాకరించారు.