ముంబై: మరో అయిదేళ్లలో భారత్‌లో కుబేరుల సంఖ్య 66% పెరిగి 3.02 లక్షలకు చేరనుంది. ప్రస్తు తం ఈ సంఖ్య 1.82 లక్షలుగా ఉంది. క్రెడిట్ సూసీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ రూపొందించిన నాలుగో వార్షిక ప్రపంచ సంపద నివేదిక 2013లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం, 2000 నుంచి భారత్‌లో సంపద సృష్టి గణనీయంగా వేగం పుంజుకుంది. మధ్య మధ్యలో కరెన్సీ పతనం వంటి ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ ఒక్కొక్కరి సంపద వార్షికంగా సగటున 8% మేర పెరిగింది. మరోవైపు, భారత్‌లో సంపద ఈ ఏడాది మధ్య నాటికి 7.4% పెరిగి 3.4 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరిందని పేర్కొంది.
దేశీయంగా కేవలం 0.4% మంది జనాభా వద్ద మాత్రమే 1 లక్ష డాలర్ల (సుమారు రూ. 61 లక్షలు) పైన సంపద ఉన్నట్లు తెలిపింది. సంఖ్యాపరంగా చూస్తే 28 లక్షల మంది జనాభాగా లెక్కగట్టింది. ఒకవైపు సంపద పెరుగుతున్నప్పటికీ ప్రజలందరికీ వృద్ధి ప్రయోజనాలు దక్కడం లేదని వివరిం చింది. ఇంకా చాలా పేదరికం ఉందని పేర్కొంది. 94% మంది వయోజనుల సంపద 10,000 డాలర్ల కన్నా తక్కువ ఉండటమే ఇందుకు నిదర్శనమని వివరించింది. 10 కోట్ల డాలర్ల పైబడిన అత్యంత సంపన్నుల సంఖ్య 770గా ఉండగా, 5 కోట్ల డాలర్ల పైబడిన సంపద కలవారి సంఖ్య 1,760గా ఉందని పేర్కొంది.
66% పెరగనున్న భారత్ కుబేరులు
Published Thu, Oct 10 2013 12:55 AM | Last Updated on Fri, Sep 1 2017 11:29 PM
Advertisement