INDIAN MILLIONAIRES
-
ఎగిరిపోతున్న సంపన్నులు! ఎక్కువగా ఆ దేశానికే..
భారత్ నుంచి ఏటా వేల సంఖ్యలో మిలియనీర్లు విదేశాలకు తరలిపోతున్నారు. ఈ ఏడాది దాదాపు 4,300 మంది మిలియనీర్లు భారత్‌ను వీడే అవకాశం ఉందని, వీరిలో ఎక్కువ మంది యూఏఈని తమ గమ్యస్థానంగా ఎంచుకున్నారని అంతర్జాతీయ పెట్టుబడుల వలస సలహా సంస్థ హెన్లీ అండ్ పార్టనర్స్ తాజా నివేదిక వెల్లడించింది.గత ఏడాది ఇదే నివేదిక ప్రకారం 5,100 మంది భారతీయ మిలియనీర్లు విదేశాలకు మకాం మార్చారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ మిలియనీర్ల వలసల విషయంలో చైనా, యూకే తర్వాత ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో ఉంటుందని అంచనా. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ ఇప్పుడు చైనాను అధిగమించగా, భారతీయ నికర మిలియనీర్లు చైనా కంటే 30 శాతం కంటే తక్కువ.కొత్త మిలియనీర్లుభారత్ ప్రతి సంవత్సరం వేలాది మంది మిలియనీర్లను కోల్పోతున్నప్పటికీ దానికంటే ఎక్కువ సంఖ్యలో కొత్త సంపన్నులను తయారు చేస్తూనే ఉందని నివేదిక పేర్కొంది. గత దశాబ్దంలో దేశంలో 85 శాతం సంపద పెరిగినట్లు వెల్లడించింది. ఇలా వెళ్తున్న మిలియనీర్లలో చాలా మంది భారత్‌లో వ్యాపార ప్రయోజనాలు, ఇళ్లను కలిగి ఉన్నారని నివేదిక ఎత్తి చూపింది. ఇది కొనసాగుతున్న ఆర్థిక సంబంధాలను సూచిస్తుంది.2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,28,000 మంది మిలియనీర్లు వలసలు వెళ్తారని భావిస్తున్నారు. వీరికి యూఏఈ, యూఎస్ఏ ఇష్టమైన గమ్యస్థానాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. భద్రత, ఆర్థిక పరిగణనలు, పన్ను ప్రయోజనాలు, పదవీ విరమణ అవకాశాలు, వ్యాపార అవకాశాలు, అనుకూలమైన జీవనశైలి, పిల్లలకు విద్యావకాశాలు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు, మొత్తం జీవన నాణ్యతతో సహా వివిధ కారణాల వల్ల సంపన్న కుటుంబాలు వలస వెళ్తున్నాయి. -
4 వేల మంది కోటీశ్వరులు వెళ్లిపోయారు!
న్యూఢిల్లీ: సొమ్ములు దండిగా ఉన్న కోటీశ్వరులు పెద్ద ఎత్తున విదేశాలకు తరలిపోతున్నారని తాజా నివేదిక వెల్లడించింది. ధనికులు పరాయి దేశాలకు తరలిపోతున్న జాబితాలో భారత్ నాలుగు స్థానంలో నిలిచింది. 2015లో మనదేశం నుంచి 4 వేల మంది కుబేరులు విదేశాలకు ఎగిరిపోయారని న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక వెల్లడించింది. ఈ నాలుగు వేల మందిలో చాలా మంది పరాయి దేశాల్లోనే స్థిర నివాసం ఏర్పచుకున్నారని పేర్కొంది. ఫ్రాన్స్ నుంచి అత్యధికంగా 10 వేల మంది మిలీయనీర్లు వలస వెళ్లిపోయారని తెలిపింది. తర్వాతి స్థానాల్లో చైనా(9 వేల మంది), ఇటలీ(6 వేల మంది) ఉన్నాయి. ఫ్రాన్స్ లో ముస్లిం, క్రైస్తవ మతఘర్షణలు పెరిగిపోవడంతో ఎక్కువ మంది మిలీయనీర్లు వలస పోతున్నారని అభిప్రాయపడింది. యూరోపియన్ దేశాలయిన బెల్జియం, జర్మనీ, స్వీడన్, బ్రిటన్ లో పెరుగుతున్న మతఘర్షణలు సమీప భవిష్యత్ లో ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని వివరించింది. గ్రీస్(3 వేల మంది), రష్యా, బ్రెజిల్, స్పెయిన్(2 వేల మంది) నుంచి కుబేరుల వలసలు పెరుగుతున్నాయి. ఎక్కుమంది కోటీశ్వరులు ఆస్ట్రేలియా(8 వేల మంది), అమెరికా(7 వేల మంది), కెనడా(5 వేలమంది)కు వలస వెళ్లిపోయారు. -
భారత మిలియనీర్ల విదేశీ బాట..
గత 14 ఏళ్లలో 61 వేల మంది వలస న్యూఢిల్లీ : భారతీయ మిలియనీర్లు విదేశాలకు అధికంగా తరలివెళ్తున్నారు. ఇతర దేశాలకు తరలివెళ్లే మిలియనీర్ల పరంగా చూస్తే.. చైనా అగ్రస్థానంలో (91,000) ఉంటే, భారత్ రెండో స్థానంలో (61,000) ఉంది. వీటి తర్వాతి స్థానాల్లో ఫ్రాన్స్ (42,000), ఇటలీ (23,000), రష్యా (20,000), ఇండోనేసియా (12,000), దక్షిణాఫ్రికా (8,000), ఈజిప్ట్ (7,000) ఉన్నాయి. గత 14 ఏళ్లలో దాదాపు 61,000 మంది భారతీయ మిలియనీర్లు విదేశాలకు తరలివెళ్లారు. ఇలా మిలియనీర్లు విదేశాలకు తరలి వెళ్లడానికి పన్నులు, భద్రత, పిల్లల విద్య తదితర అంశాలు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ విషయాలు న్యూ వరల్డ్ వెల్త్, ఎల్‌ఐఓ గ్లోబల్ కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడయ్యాయి. భారత మిలియనీర్లు ఎక్కువగా యూఏఈ, యూకే, అమెరికా, ఆస్ట్రేలియా దేశాలకు వెళ్లిపోతున్నారు. అలాగే చైనా మిలియనీర్లు కూడా అమెరికా, హాంగ్‌కాంగ్, సింగపూర్, యూకే దేశాలకు అధికంగా తరలిపోతున్నారు. మొత్తంగా చూస్తే.. మిలియనీర్ల గమ్యస్థానంగా యూకే కొనసాగుతోంది. గత 14 ఏళ్లలో దాదాపు 1.25 లక్షల మంది మిలియనీర్లు ఇతర దేశాల నుంచి యూకేకు వెళ్లిపోయారు. యూకే వెళ్లే మిలియనీర్ల సంఖ్య యూరప్, రష్యా, చైనా, భారత్ నుంచే అధికంగా ఉంది. మిలియనీర్లను ఆకర్షించడంలో యూకే తర్వాతి స్థానాల్లో అమెరికా, సింగపూర్ ఉన్నాయి. చైనా మిలియనీర్లు అధికంగా అమెరికాకు వెళ్లిపోతున్నారు. అలాగే సింగపూర్‌కు వెళ్లే మిలియనీర్లు చైనా, భారత్, ఇండోనేసియా నుంచి అధికంగా ఉన్నారు. -
66% పెరగనున్న భారత్ కుబేరులు
ముంబై: మరో అయిదేళ్లలో భారత్‌లో కుబేరుల సంఖ్య 66% పెరిగి 3.02 లక్షలకు చేరనుంది. ప్రస్తు తం ఈ సంఖ్య 1.82 లక్షలుగా ఉంది. క్రెడిట్ సూసీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ రూపొందించిన నాలుగో వార్షిక ప్రపంచ సంపద నివేదిక 2013లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం, 2000 నుంచి భారత్‌లో సంపద సృష్టి గణనీయంగా వేగం పుంజుకుంది. మధ్య మధ్యలో కరెన్సీ పతనం వంటి ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ ఒక్కొక్కరి సంపద వార్షికంగా సగటున 8% మేర పెరిగింది. మరోవైపు, భారత్‌లో సంపద ఈ ఏడాది మధ్య నాటికి 7.4% పెరిగి 3.4 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరిందని పేర్కొంది. దేశీయంగా కేవలం 0.4% మంది జనాభా వద్ద మాత్రమే 1 లక్ష డాలర్ల (సుమారు రూ. 61 లక్షలు) పైన సంపద ఉన్నట్లు తెలిపింది. సంఖ్యాపరంగా చూస్తే 28 లక్షల మంది జనాభాగా లెక్కగట్టింది. ఒకవైపు సంపద పెరుగుతున్నప్పటికీ ప్రజలందరికీ వృద్ధి ప్రయోజనాలు దక్కడం లేదని వివరిం చింది. ఇంకా చాలా పేదరికం ఉందని పేర్కొంది. 94% మంది వయోజనుల సంపద 10,000 డాలర్ల కన్నా తక్కువ ఉండటమే ఇందుకు నిదర్శనమని వివరించింది. 10 కోట్ల డాలర్ల పైబడిన అత్యంత సంపన్నుల సంఖ్య 770గా ఉండగా, 5 కోట్ల డాలర్ల పైబడిన సంపద కలవారి సంఖ్య 1,760గా ఉందని పేర్కొంది. -
కుబేర భారతం!
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నప్పటికీ, భారత్‌లో కుబేరులు మాత్రం పెరుగుతున్నారు. బ్రిక్స్ దేశాలతో పోల్చితే భారత్‌లోనే అల్ట్రా-హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్ (యూహెచ్ఎన్డబ్ల్యూఐ) అధికంగా ఉన్నారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా చూస్తే యూహెచ్ఎన్డబ్ల్యూఐ మహిళలు మనదేశంలోనే అధికంగా ఉన్నారు. ఈ వివరాలను అంతర్జాతీయ వెల్త్ ఇంటెలిజెన్స్, ప్రాస్పెక్టింగ్ కంపెనీ వెల్త్-ఎక్స్ రూపొందించిన నివేదిక వెల్లడించింది. 3 కోట్ల డాలర్ల విలువైన ఆస్తులు(ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల్లో ఉన్న షేర్లు, రెసిడెన్షియల్, ఇన్వెస్ట్మెంట్ ఆస్తులు, ఆర్ట్ కలెక్షన్లు, విమానాలు, నగదు, ఇతర ఆస్తులు కలిపి) పైబడి ఉన్న వారిని అల్ట్రా-హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్ (యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐగా పరిగణించి ఈ సంస్థ ఈ ఏడాదికి ఈ నివేదికను రూపొందించింది. ఈ నివేదిక పేర్కొన్న మరి కొన్ని ముఖ్యాంశాలు.., బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా)దేశాల్లో భారత్‌లోనే యూహెచ్ఎన్ఐడబ్ల్యూలు ఎక్కువగా ఉన్నారు. వీరి సంఖ్య 7,850గా ఉంది. వీరిలో 90 శాతానికి పైగా హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూర్, కోల్‌కత, చెన్నై, అహ్మదాబాద్, పుణే, గుర్గావ్, జైపూర్ల్లోనే నివసిస్తున్నారు. వీరందరి ఆస్తుల విలువ 93,500 కోట్ల డాలర్లుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే యూహెచ్ఎన్డబ్ల్యూఐ మహిళలు భారత్‌లోనే అధికం. మన దేశంలో వీరి సంఖ్య 1,250 గా ఉంది. వీరందరి ఆస్తుల విలువ 9,500 కోట్ల డాలర్లు. ఏడాది కాలంలో దేశ జనాభా 1.6% వృద్ధి సాధించగా, 120 మంది కొత్తగా యూహెచ్ఎన్ఐడబ్ల్యూ హోదా పొందారు. బిలియనీర్ల సంఖ్య మాత్రం ఏడాది కాలంలో 109 నుంచి 103కు తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా 2,170 మంది బిలియనీర్లు ఉన్నారు. గత ఏడాది 19,000 కోట్ల డాలర్లుగా ఉన్న భారత బిలియనీర్ల మొత్తం సంపద ఈ ఏడాదిలో 5.3 శాతం క్షీణించి 18,000 కోట్ల డాలర్లకు తగ్గింది. ఇక ప్రపంచవ్యాప్తంగా అల్ట్రా హైనెట్వర్త్ వ్యక్తుల సంఖ్య 1,99,235కు చేరింది. ఇదే ఇప్పటివరకూ అత్యంత గరిష్టం కావడం గమనార్హం. వీరిలో 1,75,730 మంది పురుషులు కాగా, 23,505 మంది మహిళలు.