
బైబ్యాక్ ఆలోచనలో డాక్టర్ రెడ్డీస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యూఎస్‌ఎఫ్‌డీఏ హెచ్చరికల నేపథ్యంలో భారీగా పతనమైన షేర్లను కొనుగోలు చేయాలని డాక్టర్ రెడ్డీస్ యాజమాన్యం నిర్ణయించింది. ప్రస్తుతం 25.57% వాటాను కలిగి ఉన్న ప్రమోటర్లు బైబ్యాక్ ద్వారా వాటా పెంచుకునే ఆలోచనలో ఉన్నారు. వచ్చే వారం జరిగే బోర్డు సమావేశంలో బైబ్యాక్‌పై నిర్ణయం తీసుకోనున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేం జీలకు తెలియచేసింది. ప్రస్తుతం కంపెనీ షేరు రూ.2,887 వద్ద కదులుతోంది.